News February 23, 2025
భువనగిరి: వారం రోజుల్లో పెళ్లి.. అంతలోనే సూసైడ్

వారం రోజుల్లో పెళ్లి పీటలు ఎక్కాల్సిన యువకుడు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన మోటకొండూర్ మండలం అమ్మనబోలులో జరిగింది. ఎస్సై వివరాలిలా.. జటంగి మహేశ్ యాదవ్ (28) డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. కుటుంబీకులు మార్చి 2న మహేశ్ వివాహం నిశ్చయించారు. శుక్రవారం మహేశ్ తన ఇంట్లో ఉరేసుకుని సూసైడ్ చేసుకున్నాడు. గమనించిన కుటుంబీకులు ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
Similar News
News March 21, 2025
బిచ్కుంద: 2024లో హత్య.. నేడు అరెస్టు

హత్య కేసులో ఒకరిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు బిచ్కుంద సీఐ నరేశ్ తెలిపారు. శుక్రవారం బిచ్కుంద పోలీస్ స్టేషన్లో ప్రెస్ మీట్‌లో హత్య కేసు వివరాలను సీఐ వెల్లడించారు. బిహార్ చెందిన అంటుకుమార్ హస్గుల్‌లో మనీష్‌కు మద్యం తాగించి హత్య చేసి పరారయ్యాడు. బిచ్కుంద మండలం హస్గుల్ గ్రామంలో 2024లో జరిగిన హత్య కేసులో నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు పంపినట్లు సీఐ పేర్కొన్నారు.
News March 21, 2025
విశాఖ – భద్రాచలం ప్రత్యేక బస్సులు

శ్రీరామ నవమి సందర్భంగా విశాఖపట్నం నుంచి భద్రాచలం పుణ్యక్షేత్రానికి ప్రత్యేక బస్సులు నడుపుతున్నామని APSRTC జిల్లా ప్రజా రవాణా అధికారి బి.అప్పలనాయుడు శుక్రవారం తెలిపారు. ఏప్రిల్ 5వ తేదీ ఉదయం 6 గంటలకు, సాయంత్రం 5 గంటలకు ప్రత్యేక బస్సులు నడవనున్నాయని ఆయన తెలిపారు. భక్తుల కోరిక మేరకు ద్వారకా బస్ స్టేషన్ కాంప్లెక్స్ నుంచి రాజమండ్రి మీదుగా నడుపుతున్నట్లు తెలిపారు.
News March 21, 2025
GREAT:TG ఖోఖో జట్టుకు ఎంపికైన అక్కాచెల్లెలు

ఆల్ ఇండియా సివిల్ సర్వీస్ క్రీడలకు ఉమ్మడి పాలమూరు జిల్లా మక్తల్ పట్టణానికి చెందిన గోపాలం, వెంకటమ్మ దంపతుల నలుగురు కూతుర్లు ఎంపికయ్యారు. తెలంగాణ రాష్ట్ర ఖోఖో మహిళల జట్టుకు అక్కాచెల్లెలు రూప(PD), దీప(SGT), శిల్ప(వెటర్నరీ అసిస్టెంట్), పుష్ప(PET) ఎంపికయ్యారు. నేటి నుంచి ఈనెల 24 వరకు ఢిల్లీలో జరగనున్న ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ క్రీడల్లో వీరు పాల్గొంటారు. CONGRATULATIONS