News February 7, 2025
భువనగిరి: వెటర్నరీ డాక్టర్‌పై అడవి దున్న దాడి

యాదాద్రి జిల్లాలో కొన్ని రోజుల నుంచి అడవి దున్న హల్చల్ చేస్తున్న విషయం తెలిసిందే. గురువారం ఉదయం చౌటుప్పల్ మండలం చిన్న కొండూరులో ప్రత్యక్షమవగా సాయంత్రం వలిగొండ శివారులో కనిపించింది. ఫారెస్ట్ అధికారులు దున్నను పట్టుకునే ప్రయత్నంలో చేయగా జూడా సజావుద్దీన్ అనే వ్యక్తిపై దాడి చేసినట్లు డీఎఫ్ఓ పద్మజారాణి తెలిపారు. క్షతగాత్రుడిని ఆసుపత్రికి తరలించామన్నారు.
Similar News
News November 10, 2025
నల్గొండ: ధాన్యం కొనుగోలుపై మంత్రుల సమీక్ష

ఖరీఫ్ ధాన్యం సేకరణ పురోగతిపై రాష్ట్ర మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠితో వీడియో కాన్ఫరెన్స్‌లో సమీక్షించారు. నల్గొండ జిల్లాలో రైతులకు ఇప్పటివరకు రూ.160 కోట్లు చెల్లించినట్లు కలెక్టర్ తెలిపారు. తడిసిన 4,600 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మిల్లర్లు కొన్నారని వివరించారు. పత్తి కొనుగోళ్ల కోసం అదనంగా తేమ కొలిచే యంత్రాల కొనుగోలుకు మంత్రి తుమ్మల ఆదేశించారు.
News November 10, 2025
స్పోర్ట్స్ రౌండప్

➣ ఈ నెల 27న ఢిల్లీలో WPL మెగా వేలం
➣ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ స్టాండింగ్స్: మూడో స్థానంలో IND, తొలి రెండు స్థానాల్లో AUS, SL
➣ బంగ్లాదేశ్ క్రికెట్ టీమ్ మాజీ కెప్టెన్ ఫరూక్ అహ్మద్‌కు గుండెపోటు.. ఐసీయూలో చికిత్స
➣ రంజీ ట్రోఫీ: తమిళనాడుపై ఆంధ్రప్రదేశ్ విజయం.. ఫస్ట్ ఇన్నింగ్స్‌లో రషీద్ (87), సెకండ్ ఇన్నింగ్స్‌లో అభిషేక్ రెడ్డి (70), కరణ్ షిండే (51) హాఫ్ సెంచరీలు
News November 10, 2025
హనుమకొండ: అగ్నివీర్ ఎంపిక రెండో షెడ్యూల్ వివరాలు

హనుమకొండలో జరిగే ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీలో భాగంగా ఈ నెల 17న నిర్మల్, రాజన్న సిరిసిల్ల (800 మంది), 18న మంచిర్యాల, పెద్దపల్లి, హైదరాబాద్ (781 మంది) అభ్యర్థులకు ఎంపికలు జరుగుతాయి. 19న సిద్దిపేట, కరీంనగర్, జనగామ, మహబూబాబాద్ జిల్లాల అభ్యర్థులకు పరీక్షలు నిర్వహిస్తారు. రన్నింగ్, ఫిజికల్ ఫిట్నెస్, మెడికల్ టెస్ట్‌లు షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయని ఆర్మీ అధికారులు తెలిపారు.


