News February 7, 2025
భువనగిరి: వెటర్నరీ డాక్టర్‌పై అడవి దున్న దాడి

యాదాద్రి జిల్లాలో కొన్ని రోజుల నుంచి అడవి దున్న హల్చల్ చేస్తున్న విషయం తెలిసిందే. గురువారం ఉదయం చౌటుప్పల్ మండలం చిన్న కొండూరులో ప్రత్యక్షమవగా సాయంత్రం వలిగొండ శివారులో కనిపించింది. ఫారెస్ట్ అధికారులు దున్నను పట్టుకునే ప్రయత్నంలో చేయగా జూడా సజావుద్దీన్ అనే వ్యక్తిపై దాడి చేసినట్లు డీఎఫ్ఓ పద్మజారాణి తెలిపారు. క్షతగాత్రుడిని ఆసుపత్రికి తరలించామన్నారు.
Similar News
News March 22, 2025
వనపర్తి: పెండింగ్ నిర్మాణ పనులు పూర్తి చేయండి: కలెక్టర్

వనపర్తి జిల్లాలో వివిధ శాఖల పరిధిలో పెండింగ్‌లో ఉన్న నిర్మాణ పనులను మార్చి చివరి నాటికి పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. శుక్రవారం జిల్లా కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్ హాల్‌లో సంబంధిత అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. మన ఊరు మనబడికి సంబంధించి తుది దశకు చేరిన పాఠశాల భవనాలను గుర్తించి వాటిని వేగంగా వాడుకలోకి తెచ్చేలా నిర్మాణ పనులను పూర్తి చేయాలన్నారు.
News March 22, 2025
కోనసీమ జిల్లా డీఆర్డీఏ పీడీ నియామకం

కోనసీమ డీఆర్డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా టి సాయినాథ్ జయచంద్ర నియమితులయ్యారు. ఆయన శుక్రవారం పీడీగా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం అయినవిల్లి విఘ్నేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. ఇప్పటివరకు పీడీగా పనిచేసిన శివ శంకర్ ప్రసాద్ పదోన్నతపై సర్ఫ్‌లో ఉన్నతి పథకం రాష్ట్ర డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టారు. కాకినాడలో ఉపాధి హామీ పథకం ఏపీడీగా పనిచేస్తున్న జయచంద్ర కోనసీమ జిల్లా ఏపీడీ బాధ్యతలు చేపట్టారు.
News March 22, 2025
శ్రీ సత్యసాయి: ప్రాథమిక అంశాలపై నివేదికల సమర్పించాలి

ప్రభుత్వ శాఖలకు సంబంధించిన ప్రాధాన్య అంశాల నివేదికలను తక్షణం సమర్పించాలని శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ టిఎస్ చేతన్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం కలెక్టర్ కార్యాలయంలో అన్ని విభాగాల జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లాకు సంబంధించిన ప్రగతి, ప్రధాన సమస్యలను ముఖ్యమంత్రికి వివరించేందుకు అవసరమైన సమాచారాన్ని సిద్ధం చేయాలన్నారు.