News February 3, 2025
భువనగిరి: సీసీ కెమెరాల నిఘాలో పరీక్షలు

యాదాద్రి జిల్లాలో నేటి నుంచి ఇంటర్ ప్రాక్టికల్స్ జరగనున్నాయి. సీసీ కెమెరాల నిఘాలో ఈ పరీక్షలు కొనసాగనున్నాయి. జిల్లా వ్యాప్తంగా 42 సెంటర్లు ఏర్పాటు చేయగా 6,418 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. ఉదయం 9 గంటల నుంచి 12 గంటలకు వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు రెండు సెషన్లు జరగనున్నాయి. విద్యార్థులు ప్రశాంతంగా పరీక్షలు రాసేలా, అన్ని ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు.
Similar News
News February 9, 2025
ఒంటరిగా ఉంటున్నారా?

దీర్ఘకాలిక ఒంటరితనం శారీరక, మానసిక సమస్యలకు దారితీస్తుందని, ఆరోగ్యంపై తీవ్రమైన ప్రతికూల ప్రభావాలను చూపుతుందని పలు అధ్యయనాల్లో వెల్లడైంది. ‘ఒంటరిగా ఉంటే.. మరణించే ప్రమాదం 29% పెరుగుతుంది. రోజుకు 15 సిగరెట్లు తాగడం కంటే ఎక్కువ ప్రమాదం. గుండె సంబంధిత వ్యాధులు, స్ట్రోక్, జ్ఞాపకశక్తి కోల్పోయే ప్రమాదం ఎక్కువ. రోగనిరోధక వ్యవస్థ బలహీనపడుతుంది. ఆందోళన పెరుగుతుంది’ అని అధ్యయనాలు చెబుతున్నాయి.
News February 9, 2025
పార్వతీపురం: జిల్లాలో 1,96,612 మంది చిన్నారులకు డి వార్మింగ్ కార్యక్రమం

పార్వతీపురం మన్యం జిల్లాలో 1,96,612 మంది చిన్నారులకు డి వార్మింగ్ కార్యక్రమం ఈనెల 10న చేపడుతున్నట్లు DM&HO డాక్టర్ భాస్కరరావు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 3845 అంగన్వాడీ కేంద్రాల్లో ఒకటి నుంచి ఐదేళ్లలోపు పిల్లలు 55,234 మంది, 5 నుంచి 19 ఏళ్ల వయస్సు గల 1,41,378 మంది పిల్లలకు ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. సిబ్బంది ప్రతి ఒక్కరికి మాత్రలు అందేలా చర్య చేపట్టాలని సూచించారు.
News February 9, 2025
రోహిత్ శర్మ రాణించాలని అభిమానుల పూజలు

టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్‌శర్మ తిరిగి ఫామ్ అందుకోవాలని అభిమానులు పూజలు చేస్తున్నారు. తమ అభిమాన క్రికెటర్ తిరిగి పుంజుకునేలా అతనిని ఆశీర్వదించాలని భగవంతుడుని ప్రార్థిస్తున్నారు. దేవుడి దగ్గర రోహిత్ ఫొటోలు పెట్టి ప్రార్థనలు చేస్తున్నారు. ఈ నెల 19 నుంచి ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభమవుతున్న విషయం తెలిసిందే.