News March 18, 2025
భువనగిరి: హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్గా కూలీ బిడ్డ

పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చని నిరూపించాడు రామన్నపేట(M) వెల్లంకికి చెందిన బలికె తరుణ్ కుమార్. రాష్ట్రంలో TGPSC సోమవారం విడుదల చేసిన ఫలితాల్లో హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్గా ఎంపికయ్యాడు. TGలో 32, 5వ జోనల్లో 5 ర్యాంక్ సాధించాడు. ప్రభుత్వ లైబ్రరీలో చదువుకుంటూ ఈ ఘనత అందుకున్నాడు. తండ్రి నర్సింహా ముంబైలో వలస కార్మికుడిగా, తల్లి మహేశ్వరీ గ్రామంలో కూలీ పని చేస్తున్నారు. అతనికి స్నేహితులు సహకారం అందించారు.
Similar News
News November 23, 2025
జర్నలిస్టుల అక్రిడిటేషన్లకు దరఖాస్తుల ఆహ్వానం

తూర్పుగోదావరి జిల్లాలో వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కార్డుల (2026-27) జారీ ప్రక్రియ ప్రారంభమైంది. పాత కార్డుల గడువు ఈ నెల 30తో ముగుస్తుండటంతో నూతన కార్డుల కోసం దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ కీర్తి చేకూరి ఆదివారం తెలిపారు. అర్హులైన పాత్రికేయులు సమాచార పౌర సంబంధాల శాఖ నిబంధనల ప్రకారం దరఖాస్తులు సమర్పించాలని, నూతన కార్డులు రెండేళ్ల పాటు అమలులో ఉంటాయని ఆమె వెల్లడించారు.
News November 23, 2025
అతిగా స్క్రీన్ చూస్తే ఆలస్యంగా మాటలు!

పిల్లలను అతిగా స్క్రీన్(TV, ఫోన్) చూసేందుకు అలవాటు చేస్తే వారి భవిష్యత్తుకు ప్రమాదమని అంతర్జాతీయ సర్వే హెచ్చరిస్తోంది. చిన్నవయసులో(1-5 ఏళ్లు) ఎక్కువగా స్క్రీన్ చూసే పిల్లలకు మాటలు రావడం ఆలస్యమవుతుందని తాజా అధ్యయనంలో తేలింది. అటు కొత్త పదాలు నేర్చుకునే సామర్థ్యం తగ్గిపోతుందని పేర్కొంది. పిల్లలు ఏం చేస్తున్నారో తల్లిదండ్రులు గమనించాలని, తప్పనిసరైతే నాలెడ్జ్ పెంచే వీడియోలను సూచించాలని చెబుతోంది.
News November 23, 2025
వనపర్తి: శిక్షకులు లేక విద్యార్థుల ఇబ్బందులు

వనపర్తి జిల్లాలో మొత్తం 12 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉన్నాయి. కొన్ని కళాశాలలో క్రీడా మైదానాలు అందుబాటులో ఉన్నా.. శిక్షకులు లేకపోవడంతో విద్యార్థులు రాష్ట్ర, జాతీయస్థాయిలో రాణించలేకపోతున్నారు. ప్రభుత్వ కళాశాలల్లో శిక్షకులు అందుబాటులో లేరు. దీంతో చాలామంది విద్యార్థులు ఆసక్తి ఉన్నా క్రీడలకు దూరమవుతున్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో శిక్షకులను నియమించాలని విద్యార్థులు కోరుతున్నారు.


