News February 26, 2025
భువనగిరి: 10 రోజుల్లో పెళ్లి.. మహిళా కానిస్టేబుల్ సూసైడ్

భువనగిరిలో మహిళా కానిస్టేబుల్ <<15576453>>బలవన్మరణానికి<<>> పాల్పడిన విషయం తెలిసిందే. కుటుంబసబ్యులు ఇష్టం లేని పెళ్లి చేస్తుండడంతో ఆమె సూసైడ్ చేసుకున్నట్లు తెలుస్తోంది. అనూషకు ఈ నెల 14న నిశ్చితార్థం జరగ్గా, వచ్చే నెల 6న పెళ్లికి ముహూర్తం నిర్ణయించారు.ఈ క్రమంలో అనూష తను అద్దెకు ఉంటున్న ఇంట్లో బలవన్మరణానికి పాల్పడ్డారు. తనకు ఈ పెళ్లి ఇష్టం లేదని సహోద్యోగులకు చెప్పినట్లు తెలుస్తోంది.
Similar News
News February 26, 2025
ప.గో జిల్లాలో: TODAY TOP HEADLINES

✷ ప.గో జిల్లాలో శివాలయాలకు పోటెత్తిన భక్తులు
✷ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సర్వం సిద్ధం కలెక్టర్ నాగరాణి
✷ నర్సాపురంలో భారీగా మద్యం సీసాలు లభ్యం
✷ ఆచంటలో పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన ఆర్డీవో దాసిరాజు
✷ నర్సాపురం మహిళ కడుపులో ఏడు కేజీల కణితి
✷ పాలకొల్లులో బెల్ట్ షాప్ నిర్వాహకుడు అరెస్టు
✷ నాగాలాండ్‌లో పర్యటించిన కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ
News February 26, 2025
BIG BREAKING: పోసాని కృష్ణమురళి అరెస్ట్

TG: వైసీపీ మద్దతుదారుడు, సినీ నటుడు పోసాని కృష్ణమురళిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఏపీలో ఆయనపై పలు కేసులు నమోదైన నేపథ్యంలో రాయచోటి పోలీసులు HYD రాయదుర్గంలోని మై హోమ్ భుజా అపార్ట్‌మెంట్‌లో ఉన్న అతడిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఏపీకి తరలిస్తున్నారు. కాగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేశ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారని పోసానిపై పలుచోట్ల కేసులు నమోదయ్యాయి.
News February 26, 2025
కృష్ణాజిల్లా టాప్ న్యూస్

* శివనామస్మరణలతో మార్మోగిన శైవ క్షేత్రాలు* పెదకళ్లేపల్లి నాగేశ్వర స్వామి ఆలయానికి పోటెత్తిన భక్తులు* రేపు జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు* డ్రై డే సందర్భంగా జిల్లా వ్యాప్తంగా ఎక్సైజ్ అధికారుల దాడులు.. మచిలీపట్నం స్టేషన్ పరిథిలో ముగ్గురు అరెస్ట్* ఎమ్మెల్సీ ఎన్నిక నేపథ్యంలో రేపు జిల్లాలో విద్యా సంస్థలకు శెలవు