News February 26, 2025

భువనగిరి: 10 రోజుల్లో పెళ్లి.. మహిళా కానిస్టేబుల్ సూసైడ్

image

భువనగిరిలో మహిళా కానిస్టేబుల్ <<15576453>>బలవన్మరణానికి<<>> పాల్పడిన విషయం తెలిసిందే. కుటుంబసబ్యులు ఇష్టం లేని పెళ్లి చేస్తుండడంతో ఆమె సూసైడ్ చేసుకున్నట్లు తెలుస్తోంది. అనూషకు ఈ నెల 14న నిశ్చితార్థం జరగ్గా, వచ్చే నెల 6న పెళ్లికి ముహూర్తం నిర్ణయించారు.ఈ క్రమంలో అనూష తను అద్దెకు ఉంటున్న ఇంట్లో బలవన్మరణానికి పాల్పడ్డారు. తనకు ఈ పెళ్లి ఇష్టం లేదని సహోద్యోగులకు చెప్పినట్లు తెలుస్తోంది.

Similar News

News March 15, 2025

కాకినాడ: ఇద్దరు పిల్లలను చంపి ఆత్మహత్య చేసుకున్న తండ్రి

image

ఓ తండ్రి కసాయిగా మారాడు. ఇద్దరు పిల్లల్ని క్రూరంగా చంపి తాను చనిపోయాడు. పిల్లలు చదవడం లేదని కాకినాడ రూరల్‌లో ఉంటున్న చంద్రకిషోర్ (37) హోలీ సంబరాలు కుటుంబంతో చేసుకున్నాడు. భార్యను వదిలేసి పిల్లలతో ఇంటికి వచ్చాడు. జోషిత(7), నిఖిల్ (6)ని తండ్రి ఇంటికి తీసుకొచ్చి బకెట్లో తలలు ముంచి దారుణంగా చంపేశాడు. అనంతరం ఆత్మహత్య చేసుకున్నాడు. పిల్లల కోసం ఇంటికి వచ్చిన భార్య ఆ ఘటన చూసి నిర్ఘాంత పోయింది.

News March 15, 2025

అమరావతి రాజధాని ప్రాంతంలో నేడు శ్రీవారి కళ్యాణం 

image

రాజధాని ప్రాంతంలోని వెంకటపాలెం TTD ఆలయం వద్ద శనివారం శ్రీవారి కల్యాణోత్సవం జరగనుంది. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తికాగా, 27వేల మంది భక్తులు కళ్యాణాన్ని తిలకించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. 1000 మంది పోలీసుల బందోబస్తుతో, 5 డ్రోన్లు, 70 సీసీ కెమెరాలు పర్యవేక్షణలో ప్రత్యేక నిఘా ఉంచారు. హాజరైన ప్రతి భక్తునికి 175 గ్రాములో లడ్డూ ప్రసాదం ఉచితంగా అందజేయనున్నారు. మీరు వెళుతున్నారా కామెంట్ చేయండి.

News March 15, 2025

NLG: కృత్రిమ మేధాతో బోధన.. నేటి నుంచి ప్రారంభం

image

నల్గొండ జిల్లాలో ఎంపిక చేసిన ప్రాథమిక పాఠశాలల్లో నేటి నుంచి కృత్రిమ మేధాతో బోధన ప్రారంభం కానుంది. నల్లగొండ జిల్లా వ్యాప్తంగా 10 మండలాల్లో 14 పాఠశాలలను ఎంపిక చేశారు. అత్యాధునిక సాంకేతికత పరిజ్ఞానం ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (కృత్రిమ మేధ) సాయంతో ప్రాథమిక విద్య బలోపేతం చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. చదువులో వెనుకబడిన పిల్లల కోసం ఎంపిక చేసిన పాఠశాలల్లో ఏఐ బోధన చేపట్టనున్నారు.

error: Content is protected !!