News January 26, 2025
భువనగిరి:17 గ్రామాలలో పథకాలు ప్రారంభం

నేడు ప్రభుత్వం నాలుగు పథకాలను జిల్లాలో 17 మండలాల వ్యాప్తంగా 17 గ్రామాల్లో ప్రారంభించనున్నారు. ఈ పథకాలను మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 4 గంటల వరకు ప్రారంభించడానికి అధికారులు సిద్ధమయ్యారు. ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలతో పాటు జిల్లా ఉన్నతాధికారులు ప్రారంభించనున్నారు.
Similar News
News October 17, 2025
అలిగి అత్తారింటికి ఎందుకు వెళ్లకూడదు?

పూర్వం కుమారుడిని సరైన దారిలో పెట్టలేకపోతే అతడిని ఏడాదంతా అత్తారింటికి పంపేవారు. ఇది దాదాపు శిక్షతో సమానం. ఎవరైనా సరే తనవారిపై అలిగి అత్తారింటికి వెళ్లినప్పుడు వారు తమ స్వేచ్ఛను, మానసిక ఆనందాన్ని కోల్పోతారు. వేరే వాతావరణం, నియమాల మధ్య ఉండాల్సి వస్తుంది. కోపం అనేది తాత్కాలికమే. అలిగి వెళ్లడం వల్ల శాశ్వత బంధాలు, వ్యక్తిగత స్వేచ్ఛ దెబ్బతింటాయి. అందుకే అలిగి అత్తారింటికి వెళ్లకూడదని చెబుతారు.
News October 17, 2025
ఇన్స్టాలో దీపావళి ఎఫెక్ట్ ట్రై చేశారా?

దీపావళి కోసం మెటా సంస్థ ఇన్స్టాలో కొత్త ఎఫెక్ట్స్ తీసుకొచ్చింది. వాటిని ట్రై చేసేందుకు ఇన్స్టా ఓపెన్ చేసి మీ ప్రొఫైల్ దగ్గర ‘+’ క్లిక్ చేయండి. మీకు కావాల్సిన ఫొటోని సెలక్ట్ చేసుకోండి. పైన ఉండే బ్రష్ ఐకాన్ క్లిక్ చేయండి. బోటమ్లో ఫైర్ వర్క్స్, దియాస్ అని ఆప్షన్స్ ఉంటాయి. వాటిలో మీకు నచ్చింది సెలక్ట్ చేసుకుంటే AI ఆటోమేటిక్గా ఇమేజ్ క్రియేట్ చేస్తుంది. మీకు నచ్చితే డన్ కొట్టి పోస్ట్ చేసుకోవచ్చు.
News October 17, 2025
నేడు విద్యుత్ ఉద్యోగులతో మరోసారి చర్చలు

AP: ప్రధాని పర్యటన నేపథ్యంలో విద్యుత్ ఉద్యోగులు <<18008727>>సమ్మె<<>>ను తాత్కాలికంగా వాయిదా వేసిన విషయం తెలిసిందే. ఈనెల 15న జరిగిన చర్చల్లో కొన్ని అంశాలపై చర్చలు కొలిక్కి వచ్చాయని JAC నేత కృష్ణయ్య తెలిపారు. దీంతో మిగిలిన అంశాలపై ఇవాళ చర్చించి సమ్మెపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ఈ మేరకు మధ్యాహ్నం 3 గం.కు విజయవాడలో చర్చలు ప్రారంభం కానున్నాయి.