News October 5, 2024

భువనేశ్వర్ విమానాశ్రయాన్ని అభివృద్ధి చేస్తాం: మంత్రి

image

శ్రీకాకుళం జిల్లాకు చెందిన కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు శుక్రవారం భువనేశ్వర్ విమానాశ్రయం టెర్మినల్-1, 2 భవనాలను పరిశీలించారు. భువనేశ్వర్ ఎయిర్‌పోర్ట్ ప్రస్తుత సామర్థ్యం 4.6 మిలియన్లు ఉండగా.. ఏటా 8 మిలియన్ల మంది ప్రయాణికులు రాకపోకలు సాగించేలా విస్తరణ పనులు చేపడతామని అధికారులకు తెలిపారు. విమానాశ్రయాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తామని అన్నారు.

Similar News

News November 6, 2024

సోంపేట: అత్తకు తలకొరివి పెట్టిన కోడలు

image

సోంపేట మండలం జింకిభద్ర గ్రామానికి చెందిన యజ్జల గోపమ్మ తన కోడలు తులసమ్మతో కలిసి ఉంటున్నారు. అనారోగ్యంతో గోపమ్మ మంగళవారం మృతిచెందారు. గోపమ్మకు కుమారుడు ప్రసాద్, కుమార్తె బెంగళూరులో కూలీ పనులకు వలస వెళ్లారు. అంత్యక్రియలు చేయడానికి ప్రసాద్ అందుబాటులో లేరు. దీంతో కోడలు తులసమ్మే అత్తకు తలకొరివి పెట్టి దహన సంస్కారాలు నిర్వహించారు.

News November 6, 2024

శ్రీకాకుళం: IIIT విద్యార్థిని ఆత్మహత్యాయత్నం

image

శ్రీకాకుళం రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విద్యాలయం (త్రిబుల్ ఐటీ) విద్యార్థిని  ఆత్మహత్య ప్రయత్నం చేసింది. ప్రస్తుతం శ్రీకాకుళం రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. విష ద్రావణం తాగిన విద్యార్థిని గుర్తించిన వసతి గృహం సిబ్బంది అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు. ఫ్రీ యూనివర్సిటీ కోర్స్ మొదటి ఏడాది చదువుతున్న ఆమెది సొంత ప్రాంతం నంద్యాల.

News November 6, 2024

ధాన్యం కొనుగోలు ప్రారంభించాలి: కలెక్టర్

image

పార్వతీపురం మన్యం జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రారంభించాలని మంగళవారం మన్యం జిల్లా కలెక్టర్ ఏ శ్యాంప్రసాద్ అధికారులను ఆదేశించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల సిబ్బందికి శిక్షణ ఇవ్వాలని, పరికరాలు అందుబాటులో ఉండాలని చెప్పారు. మిల్లర్లు బ్యాంకు గ్యారంటీ ఇవ్వాలన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాట్లుపై సంబంధిత అధికారులతో తన కార్యాలయంలో మంగళవారం కలెక్టర్ శ్యాంప్రసాద్ సమీక్షించారు.