News January 23, 2025
భూంపల్లి: ఇంటి నుంచి వెళ్లి చెరువులో శవమయ్యాడు

ఇంటి నుంచి వెళ్లిన వ్యక్తి చెరువులో శవమై తేలాడు. SI హరీష్ గౌడ్ తెలిపిన వివరాలు.. అక్బర్‌పేట్ భూంపల్లి మండలం చిన్ననిజాంపేటకు చెందిన రంజిత్(33) మంగళవారం సాయంత్రం ఇంటి నుంచి బయటకు వెళ్లిన తిరిగి రాలేదు. దీనిపై కుటుంబీకులు నిన్న పోలీసులకు ఫిర్యాదు చేశారు. పొతారెడ్డిపేట పెద్ద చెరువు వద్ద ఉన్న బైక్, ఫొన్ ఆధారంగా గాలించగా చెరువులో మృతదేహం దొరికింది. ఘటనపై కేసు నమోదైంది.
Similar News
News December 6, 2025
ఎల్లారెడ్డిపేట: విషాదం.. సౌదీలో ఆగిన గుండె

ఎల్లారెడ్డిపేట మండలం గుండారం గ్రామ గుట్టపల్లి చెరువు తండాకు చెందిన వ్యక్తి సౌదీలో గుండెపోటుతో మృతి చెందాడు. స్థానికుల వివరాల ప్రకారం.. గుగులోతు రవి అనే వ్యక్తి బతుకుదెరువు కోసం విజిట్ వీసా మీద ఆరు నెలల క్రితం సౌదీ వెళ్లాడు. శనివారం ఉదయం 11 గంటలకు గుండెపోటుతో మృతి చెందినట్లు అక్కడివారు కుటుంబ సభ్యులకు తెలిపారు. మృతదేహం త్వరగా స్వగ్రామం వచ్చేటట్లు చూడాలని KTRను బాధిత కుటుంబం వేడుకుంటోంది.
News December 6, 2025
మొబైల్ రీఛార్జ్ ధరలపై యూజర్ల ఆగ్రహం!

కొన్నేళ్లుగా ఇంటర్నెట్ వినియోగం పెరిగింది. దీంతో వేగవంతమైన నెట్ సేవల ధరలూ పెరిగిపోయాయి. అయితే ఇతర దేశాలతో పోల్చితే రేట్లు మన దగ్గరే తక్కువ. కానీ ఒకప్పటితో పోల్చితే కనీస రీఛార్జ్ ధరలు భారీగా పెరిగాయని యూజర్లు వాపోతున్నారు. గతంలో రూ.10 రీఛార్జ్ చేసి కాల్స్ మాట్లాడుకునేవాళ్లమని, ఇప్పుడు కనీసం రూ.199 రీఛార్జ్ చేయాల్సి వస్తోందని మండిపడుతున్నారు. టెలికం సంస్థల దోపిడీని కేంద్రం అరికట్టాలని కోరుతున్నారు.
News December 6, 2025
ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలకు నోటిఫికేషన్

<


