News January 23, 2025

భూంపల్లి: ఇంటి నుంచి వెళ్లి చెరువులో శవమయ్యాడు

image

ఇంటి నుంచి వెళ్లిన వ్యక్తి చెరువులో శవమై తేలాడు. SI హరీష్ గౌడ్ తెలిపిన వివరాలు.. అక్బర్‌పేట్ భూంపల్లి మండలం చిన్ననిజాంపేటకు చెందిన రంజిత్(33) మంగళవారం సాయంత్రం ఇంటి నుంచి బయటకు వెళ్లిన తిరిగి రాలేదు. దీనిపై కుటుంబీకులు నిన్న పోలీసులకు ఫిర్యాదు చేశారు. పొతారెడ్డిపేట పెద్ద చెరువు వద్ద ఉన్న బైక్, ఫొన్ ఆధారంగా గాలించగా చెరువులో మృతదేహం దొరికింది. ఘటనపై కేసు నమోదైంది.

Similar News

News February 9, 2026

వరంగల్‌లో మైక్రో అబ్జర్వర్లకు శిక్షణ

image

మున్సిపల్ ఎన్నికల నిర్వహణలో భాగంగా మైక్రో అబ్జర్వర్లకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎన్నికల అధికారి, కలెక్టర్ డాక్టర్ సత్య శారదతో పాటు ఎన్నికల జనరల్ అబ్జర్వర్ కిల్లు శివకుమార్ నాయుడు హాజరయ్యారు. మాస్టర్ ట్రైనర్ల ద్వారా మైక్రో అబ్జర్వర్లకు ఎన్నికల విధి విధానాలపై అవగాహన కల్పించారు. పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా, సాగేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు.

News February 9, 2026

టాలెంట్‌కు పరీక్షలు కొలమానం కాదు: శ్రీధర్ వెంబు

image

టాలెంట్‌ను కొలవడంలో పరీక్షలు, ఇంటర్వ్యూలు ప్రమాణాలు కాదని ZOHO కో-ఫౌండర్ శ్రీధర్ వెంబు అన్నారు. నిజ జీవితంలో ఓ వ్యక్తి అసాధారణ ప్రతిభను వీటి ద్వారా గుర్తించలేరని పేర్కొన్నారు. ఫ్రెంచ్ మ్యాథమెటీషియన్ డ్యుమినిల్ ఎప్పుడూ మ్యాథ్స్ కాంపిటీషన్‌లో పాల్గొనలేదని, అయినా సత్తా ఏంటో చూపారని Meta AI మాజీ శాస్త్రవేత్త యాన్ లెకన్ ట్వీట్ చేశారు. యాన్ కామెంట్స్‌కు మద్దతుగా వెంబు ఈ విధంగా స్పందించారు.

News February 9, 2026

GWL: ‘భక్తులకు ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేయాలి’

image

మహాశివరాత్రి ఉత్సవాల సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేయాలని గద్వాల కలెక్టర్ సంతోష్ సంబంధిత అధికారులను ఆదేశించారు. అలంపూర్‌లో వెలసిన జోగులాంబ దేవి, బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయాల్లో జరిగే మహాశివరాత్రి వేడుకలపై సోమవారం కలెక్టరేట్‌లో సమీక్ష నిర్వహించారు. ఈనెల 14 నుంచి 18 వరకు జరిగే ఉత్సవాల సందర్భంగా భక్తులకు తాగునీరు, పార్కింగ్ తదితర ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు ఉండాలన్నారు.