News April 1, 2025
భూకంప జోన్-3లో భద్రాచలం

భూకంపాలు ఏర్పడే జోన్-3 పరిధిలో భద్రాచలం ఉన్నట్లు శాస్త్రవేత్తలు నిర్ధారించారు. ఈ ప్రాంతంలో తీవ్రత 0.125గ్రావిటీగా ఉంటుందని తెలిపారు. దీంతో భూకంపాలు స్వల్పంగా వచ్చే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. గత 56ఏళ్లలో ఈ ప్రాంతంలో 199సార్లు భూకంపాలు వచ్చాయన్నారు. 1969లో పర్ణశాలలో వచ్చిన భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.5గా నమోదైంది. 2024 DEC 4న కూడా ఇక్కడ భూమి స్వల్పంగా కంపించింది.
Similar News
News October 18, 2025
వైసీపీ జిల్లా అధ్యక్షురాలిగా అనంతలక్ష్మి

వైసీపీ కాకినాడ జిల్లా అధ్యక్షురాలిగా పెద్దాపురం మండలం కట్టమూరు గ్రామానికి చెందిన ఏలేటి అనంతలక్ష్మి ఎంపికయ్యారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. క్షేత్రస్థాయిలో పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానని ఈ సందర్భంగా అనంతలక్ష్మి అన్నారు.
News October 18, 2025
భూపాలపల్లి: మద్యం షాపులకు టార్గెట్ రీచ్ అయ్యేనా..!

భూపాలపల్లి జిల్లాలో మద్యం దుకాణాలకు టెండర్లు నేటితో పూర్తి కానుంది. భూపాలపల్లి, ములుగు జిల్లాల పరిధిలో 59 మద్యం దుకాణాలకు గత నెల 26 నుంచి టెండర్లు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు 525 మంది నుంచి దరఖాస్తులు అందాయి. దీంతో ప్రభుత్వానికి రూ.15.27 కోట్ల ఆదాయం వచ్చింది. గతంలో 59 షాపులకు 2,161 దరఖాస్తుల రాగా, 43.22 కోట్ల ఆదాయం ప్రభుత్వానికి వచ్చింది. ప్రస్తుతం వ్యాపారులందరూ సిండికేట్లుగా మారారు.
News October 18, 2025
కొత్తగూడెం నుంచి ప్రత్యేక పంచారామ సర్వీసులు

కార్తీక మాసాన్ని పురస్కరించుకొని భక్తుల కోసం కొత్తగూడెం ఆర్టీసీ విభాగం ప్రత్యేక సర్వీసులు ప్రకటించింది. కొత్తగూడెం, పాల్వంచ నుంచి పంచారామాలు (అమరావతి, భీమవరం, పాలకొల్లు, ద్రాక్షారామం, సామర్లకోట) వరకు సూపర్ లగ్జరీ బస్సు నడిపిస్తున్నామన్నారు. ఈ నెల 26న రాత్రి 9 గంటలకు బస్సు బయలుదేరుతుందన్నారు. అన్నవరంకు కూడా డీలక్స్ సర్వీసు అందుబాటులో ఉంది.