News February 20, 2025
భూపాలపల్లిలో దారుణ హత్య.. భూ వివాదమే కారణమా?

భూపాలపల్లి పట్టణంలోని రెడ్డి కాలనీలో బుధవారం రాత్రి 15వ వార్డు తాజా మాజీ కౌన్సిలర్ సరళ భర్త రాజలింగమూర్తి హత్య కలకలం రేపిన విషయం తెలిసిందే. బుధవారం సాయంత్రం రాజలింగమూర్తి తన ఇంటికి వెళ్తున్న క్రమంలో నలుగురు వ్యక్తులు విచక్షణారహితంగా దాడి చేసి హత్య చేశారని స్థానికులు తెలిపారు. ఈ హత్యకు జిల్లా కేంద్రంలోని ఓ భూవివాదమే కారణమని సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News September 17, 2025
ప్రపంచ వాస్తుశిల్పి విశ్వకర్మ: జేసీ నిశాంతి

అమలాపురం కలెక్టరేట్ భవనంలో వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బుధవారం విశ్వకర్మ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ విశ్వాన్ని సృష్టించిన ఇంజినీర్ విశ్వకర్మ అని, ఆయన ప్రపంచ వాస్తుశిల్పిగా పేరు సంపాదించారని జిల్లా జాయింట్ కలెక్టర్ టి. నిశాంతి అన్నారు. ఈ కార్యక్రమంలో అంబేడ్కర్ కోనసీమ జిల్లాకు చెందిన విశ్వబ్రాహ్మణ సంఘ ప్రతినిధులు పాల్గొన్నారు.
News September 17, 2025
MLC తీన్మార్ మల్లన్న కొత్త పార్టీ

TG: రాష్ట్రంలో మరో కొత్త పార్టీ ఆవిర్భవించింది. MLC చింతపండు నవీన్(తీన్మార్ మల్లన్న) ‘తెలంగాణ రాజ్యాధికార పార్టీ’(TRP) పేరుతో రాజకీయ పార్టీని ప్రకటించారు. హైదరాబాద్లోని ఓ హోటల్లో పలువురు బీసీ ప్రతినిధులతో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఈ ప్రకటన చేశారు. ఆత్మగౌరవం, అధికారం, వాటా అనే నినాదాలతో పార్టీ ఆవిర్భవించినట్లు మల్లన్న తెలిపారు. వచ్చే అన్ని ఎన్నికల్లో TRP పోటీ చేస్తుందని వెల్లడించారు.
News September 17, 2025
బాపట్లలో స్వస్త్ నారీ సశక్త్ పరివార్

ఆరోగ్యకరమైన మహిళలు – బలమైన కుటుంబం లక్ష్యంతో చేపట్టిన స్వస్త్ నారీ సశక్త్ పరివార్ కార్యక్రమాన్ని కలెక్టర్ వినోద్ కుమార్ బుధవారం బాపట్లలో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మహిళలకు ఆరోగ్య పరిక్షలు చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ.. మహిళల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ పాల్గొన్నారు.