News February 20, 2025

భూపాలపల్లిలో దారుణ హత్య.. భూ వివాదమే కారణమా?

image

భూపాలపల్లి పట్టణంలోని రెడ్డి కాలనీలో బుధవారం రాత్రి 15వ వార్డు తాజా మాజీ కౌన్సిలర్ సరళ భర్త రాజలింగమూర్తి హత్య కలకలం రేపిన విషయం తెలిసిందే. బుధవారం సాయంత్రం రాజలింగమూర్తి తన ఇంటికి వెళ్తున్న క్రమంలో నలుగురు వ్యక్తులు విచక్షణారహితంగా దాడి చేసి హత్య చేశారని స్థానికులు తెలిపారు. ఈ హత్యకు జిల్లా కేంద్రంలోని ఓ భూవివాదమే కారణమని సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News March 18, 2025

అల్లూరి జిల్లాలో టుడే టాప్ న్యూస్

image

>ఉప్ప తోటల్లో సినిమా షూటింగ్ సందడి>అల్లూరి జిల్లాలో పటిష్ఠ బందోబస్తు నడుమ ప్రారంభమైన పది పరీక్షలు>పది పరీక్షలకు 117 మంది విద్యార్థులు గైర్హాజరు>వీఆర్ పురం: తేనె మంచుతో జీడిమామిడి పూతకు నష్టం>కొయ్యూరులో భానుడి భగభగలు>ఉద్యోగస్థులు విధులకు డుమ్మా కొడితే నేరం..న్యాయమూర్తి>రంపచోడవరం: గ్రీవెన్స్‌కు 82 ఫిర్యాదులు>పెదబయలు: రోగి సహాయకులకు భోజనం పెట్టాలి

News March 18, 2025

RR కలెక్టరేట్‌లో 72 ఫిర్యాదులు స్వీకరణ

image

ప్రజావాణి ఆర్జీలను పెండింగ్‌లో ఉంచకుండా పరిష్కరించాలని జిల్లా అదనపు కలెక్టర్ ప్రతిమ సింగ్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో ప్రజావాణిలో ఫిర్యాదుదారులు అందజేసిన ఆర్జీలను జిల్లా రెవెన్యూ అధికారి సంగీతతో కలసి స్వీకరించారు. అధికారులు తక్షణమే స్పందిస్తూ వెంటనే పరిష్కరించాలని ఆమె ఆదేశించారు. రెవెన్యూ 40, ఇతర శాఖల్లో 32, మొత్తం 72 ఫిర్యాదులు స్వీకరించారు.

News March 17, 2025

పార్లమెంట్‌లో అరకు కాఫీ స్టాల్స్‌ ఏర్పాటుకు అనుమతి

image

పార్లమెంటులో అరకు కాఫీ స్టాల్స్‌ ఏర్పాటు చేయడానికి ఆమోదం లభించింది. 2 కాంప్లిమెంటరీ స్టాళ్ల ఏర్పాటుకు లోక్‌సభ సచివాలయం అనుమతి ఇచ్చింది. సంగం, నలంద లైబ్రరీ వద్ద వాటిని ఏర్పాటు చేసుకోవాలని తెలిపింది. ఈ మేరకు AP MP కలిశెట్టికి లోక్‌సభ డిప్యూటీ కార్యదర్శి అజిత్ లేఖ రాశారు. అరకు కాఫీకి ప్రచారం కల్పించాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం మేరకు TDP ఎంపీలు గతంలో లోక్‌సభ స్పీకర్‌ను కోరగా తాజాగా అనుమతి లభించింది.

error: Content is protected !!