News March 3, 2025
భూపాలపల్లిలో యాక్సిడెంట్.. ముగ్గురి మృతి

జయశంకర్ భూపాలపల్లి జిల్లా రాంపూర్ క్రాస్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికులు, ప్రయాణికులు తెలిపిన వివరాల ప్రకారం.. మహాముత్తారం మండలం మీనాజీపేట గ్రామానికి చెందిన పింగిలి రాజిరెడ్డి, లడ్డు, పంబాపూర్‌కు చెందిన సతీష్‌గా ఘటనాస్థలిలోనే మృతిచెందారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News March 4, 2025
పార్వతీపురం: అందుబాటులో పదో తరగతి హాల్ టికెట్లు

పదో తరగతి విద్యార్థులకు హాల్ టికెట్లు అందుబాటులో ఉన్నాయని జిల్లా విద్యాశాఖ అధికారి ఎన్. తిరుపతి నాయుడు తెలిపారు. ప్రధానోపాధ్యాయులు విద్యార్థి పేరు, పుట్టిన తేదీ, మీడియం, విద్యార్థి ఫోటో, సంతకం, సబ్జెక్టు వివరాలను నిశితంగా పరిశీలించల్లన్నారు. హాల్ టికెట్ల్లో ఏవైనా తప్పులు ఉంటే గుర్తించి తక్షణమే పరీక్షల విభాగాన్ని సంచాలకులకు సమాచారం అందించాలన్నారు. www.bse.ap.in వెబ్‌సైట్‌ను పరిశీలించాలని సూచించారు.
News March 4, 2025
ఉత్తరాంధ్ర టీచర్ల MLC ఎన్నిక.. ఎవరికి ఎన్ని ఓట్లంటే..?

➤ గాదె శ్రీనివాసులు నాయుడు: 12,035(గెలుపు)
➤ పాకలపాటి రఘువర్మ : 8,527
➤ కోరెడ్ల విజయ గౌరీ : 5,900
➤ నూకల సూర్యప్రకాశ్ : 89
➤ పోతల దుర్గారావు : 68
➤ సుంకర శ్రీనివాసరావు : 39
➤ రాయల సత్యనారాయణ : 32
➤ కోసూరు రాధాకృష్ణ : 31
➤ సత్తలూరి శ్రీరంగ పద్మావతి : 15
➤ పెదపెంకి శివప్రసాద్ : 15
➤ ఇన్ వ్యాలీడ్ : 656
News March 4, 2025
MLC ఎన్నికలు.. అప్పుడు PRTU.. ఇప్పుడు BJP

టీచర్స్ ఎమ్మెల్సీ బీజేపీ అభ్యర్థి మల్క కొమరయ్య మొదటి ప్రాధాన్యం ఓట్లతో గెలుపొందారు. మొత్తం 27,088 ఓట్లకు గాను 25,041 ఓట్లు పోలు కాగా.. 24,144 చెల్లుబాటు అయ్యాయి. దీంతో గెలుపు కోటా ఓట్లు 12,073గా నిర్ధారించారు. మల్క కొమురయ్య 12,959, వంగ మహేందర్‌రెడ్డి 7,182, అశోక్‌కుమార్ 2,621, కూర రఘోత్తంరెడ్డికి 428 ఓట్లు వచ్చాయి. గతంలో PRTU బలపరిచిన రఘోత్తంరెడ్డి విజయం సాధించగా, ఈసారి బీజేపీ గెలిచింది.