News March 3, 2025

భూపాలపల్లిలో యాక్సిడెంట్.. ముగ్గురి మృతి

image

జయశంకర్ భూపాలపల్లి జిల్లా రాంపూర్ క్రాస్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికులు, ప్రయాణికులు తెలిపిన వివరాల ప్రకారం.. మహాముత్తారం మండలం మీనాజీపేట గ్రామానికి చెందిన పింగిలి రాజిరెడ్డి, లడ్డు, పంబాపూర్‌కు చెందిన సతీష్‌గా ఘటనాస్థలిలోనే మృతిచెందారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News March 4, 2025

BHPL: పెళ్లికి వెళ్లొస్తుండగా ముగ్గురు దుర్మరణం.. UPDATE

image

రోడ్డు ప్రమాదంలో BHPL జిల్లాకు చెందిన <<15642532>>ముగ్గురు మృతి<<>> చెందిన విషయం తెలిసిందే. స్థానికుల వివరాలు.. మహాముత్తారం మండలం మీనాజీపేట గ్రామానికి చెందిన రాజిరెడ్డి, రవీందర్ రెడ్డి ఓ వివాహానికి హాజరై వస్తున్నారు. పంబాపూర్‌కు చెందిన సతీశ్ BHPLకి వస్తున్నాడు. ఈ క్రమంలో రాంపూర్ శివారులోన మూల మలుపు వద్ద ఎదురెదురుగా బైకులు ఢీకొన్నాచి. ఇద్దరు అక్కడికక్కడే మృది చెందగా సతీశ్‌ను ఆస్పత్రికి తరలిస్తుండగా మరణించాడు.

News March 4, 2025

డీజేలు పెడితే జైలుకే: వరంగల్ ఏసీపీ

image

వరంగల్ నగర ప్రజలకు ఏసీపీ నందిరం నాయక్ కీలక సూచనలు చేశారు. వివాహ, ఇతర వేడుకల్లో డీజే సౌండ్స్ పెట్టే వారిపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. DJలు సీజ్ చేస్తామని హెచ్చరించారు. ఇంటర్మీడియట్, SSC, ఇతర పోటి పరీక్షలు ఉన్నందున వివాహ ఊరేగింపు, ఇతర వేడుకల్లో DJ సౌండ్స్ పెట్టి విద్యార్థులు, వృద్ధులు, చిన్నపిల్లలు, ప్రజలకి ఇబ్బంది కలిగించవద్దన్నారు. DJ ఆపరేటర్లు, యజమానులపై కేసు నమోదు చేస్తామన్నారు.

News March 4, 2025

దొంగలు అరెస్ట్.. రూ.5.86 లక్షలు స్వాధీనం

image

వర్ధన్నపేట పట్టణ కేంద్రంలో కొన్ని రోజుల క్రితం తాళం వేసి ఉన్న ఇంట్లో దొంగలు పడి విలువైన వస్తువులు నగదును దోచుకెళ్లారు. ఏసీపీ నరసయ్య కథనం ప్రకారం.. సోమవారం పోలీసులు వాహన తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో జాడి శ్రీకాంత్(24),కోడెం గణేష్(24)లు చూసి పారిపోయారు. వారిని అదుపులోకి తీసుకొని విచారించగా దొంగతనం చేసినట్టు అంగీకరించారు. వారి నుంచి రూ.5,86,000 నగదు స్వాధీనం చేసుకొని అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు.

error: Content is protected !!