News March 3, 2025
భూపాలపల్లిలో యాక్సిడెంట్.. ముగ్గురి మృతి

జయశంకర్ భూపాలపల్లి జిల్లా రాంపూర్ క్రాస్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికులు, ప్రయాణికులు తెలిపిన వివరాల ప్రకారం.. మహాముత్తారం మండలం మీనాజీపేట గ్రామానికి చెందిన పింగిలి రాజిరెడ్డి, లడ్డు, పంబాపూర్కు చెందిన సతీష్గా ఘటనాస్థలిలోనే మృతిచెందారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News November 19, 2025
కాకినాడ మీదుగా శ్రీలంక వెళ్లాలనుకున్న హిడ్మా?

AP: వరుస ఎన్కౌంటర్ల నేపథ్యంలో దండకారణ్యం నుంచి సురక్షిత ప్రాంతానికి వెళ్లిపోవాలని మావోయిస్టు అగ్రనేత హిడ్మా ప్రయత్నించినట్లు తెలుస్తోంది. కొద్దిమంది అనుచరులతో కలిసి శ్రీలంకలో తలదాచుకోవాలని భావించాడని సమాచారం. కాకినాడ పోర్టు నుంచి సముద్రమార్గంలో వెళ్లేందుకు ప్లాన్ వేసినట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. ఈ క్రమంలో దండకారణ్యం నుంచి బయటికొచ్చిన హిడ్మా మారేడుమిల్లిలో ఎన్కౌంటర్లో చనిపోయాడని తెలుస్తోంది.
News November 19, 2025
అన్నదాత సుఖీభవ- నేడే అకౌంట్లలోకి రూ.7వేలు

AP: PM కిసాన్, అన్నదాత సుఖీభవ కింద అర్హులైన రైతుల ఖాతాల్లో నేడు రూ.7వేలు చొప్పున జమ కానున్నాయి. PM కిసాన్ కింద ప్రధాని మోదీ రూ.2 వేలు, అన్నదాత సుఖీభవ రెండో విడత కింద కడప జిల్లా కమలాపురంలో జరిగే కార్యక్రమంలో సీఎం చంద్రబాబు రూ.5వేలు.. మొత్తంగా రూ.7వేలు చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 46.86 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.7వేలు చొప్పున జమ అవుతాయని ప్రభుత్వం తెలిపింది.
News November 19, 2025
ఉమ్మడి కరీంనగర్లో BCలకు 268 GPలే..!

50% రిజర్వేషన్లు మించకూడదన్న నిబంధనతో బీసీలకు 22 శాతం రిజర్వేషన్ల క్యాప్తో ఎన్నికలు నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. కాగా, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 1,216 గ్రామపంచాయతీల(GP)లో 22% రిజర్వేషన్లు కల్పిస్తే బీసీలకు మొత్తంగా 268 స్థానాలు మాత్రమే దక్కనున్నాయి. ఇక రిజర్వేషన్ల ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని సర్కార్ ఇప్పటికే పంచాయతీరాజ్ శాఖకు ఆదేశాలు జారీ చేసింది.


