News January 30, 2025

భూపాలపల్లి: ‘అందరికీ రుణమాఫీ జరగలేదు’

image

MRPS-TS జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షుడు ఎలుకటి రాజయ్య బుధవారం జిల్లా వ్యవసాయ అధికారిని కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా రాజయ్య మాట్లాడుతూ.. 2 లక్షలకు పైగా రుణం ఉన్న రైతుల రుణాలను త్వరితగతిన మాఫీ చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే అన్ని రకాల రైతు రుణాలు మాఫీ చేస్తానని చెప్పిందని, కానీ క్షేత్రస్థాయిలో అందరికీ రుణమాఫీ జరగలేదన్నారు.

Similar News

News November 18, 2025

భూపాలపల్లి: రేపటి నుంచి సీసీఐ పత్తి కొనుగోళ్లు ప్రారంభం

image

జిల్లాలోని జిన్నింగ్ మిల్లుల వద్ద బుధవారం నుంచి సీసీఐ కొనుగోళ్లు ప్రారంభిస్తున్నట్లు యాజమాన్యాలు ప్రకటించాయి. సీసీఐకి పత్తి విక్రయించాలనుకునే రైతులు వెంటనే స్లాట్ బుకింగ్ చేసుకోవాలని జిల్లా మార్కెట్ అధికారి ప్రవీణ్ రెడ్డి కోరారు. గతంలో ( ఈ నెల 17, 18 తేదీలలో) స్లాట్ బుక్ చేసుకున్నవారు కూడా తిరిగి బుక్ చేసుకోవాలని ఆయన సూచించారు.

News November 18, 2025

సిరిసిల్ల: సదరం క్యాంపుల తేదీలు ఇవే!

image

రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో సదరం క్యాంపుల నిర్వహణ తేదీలను మంగళవారం ప్రకటించారు. ఈ నెల 24, 25న మానసిక, 25అర్థో, 26 వినికిడి సమస్యలు, 27 జనరల్, 29 కంటి చూపు సంబంధించిన సమస్యలు ఉన్నవారు శిబిరానికి హజరుకావాలన్నారు. దివ్యాంగులు సంబంధిత మెడికల్ డాక్యుమెంట్లు, ఫొటోలు తీసుకుని ఉదయం 9 గంటలకు హాజరు కావాలని సూచించారు.

News November 18, 2025

MBNR: పీయూలో “నషా ముక్త్ భారత్ అభియాన్”

image

పాలమూరు విశ్వవిద్యాలయం విద్యా కళాశాలలో “నషా ముక్త్ భారత్ అభియాన్” కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కరుణాకర్ రెడ్డి తన సందేశంలో యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండి, ఆరోగ్యకరమైన జీవన శైలిని అవలంబించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ డాక్టర్ మాళవి, అదనపు పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్ అనురాధ రెడ్డి, అధ్యాపకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.