News March 4, 2025

భూపాలపల్లి: ఇంటర్మీడియట్ పరీక్షా కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్

image

భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ మంగళవారం జిల్లా కేంద్రంలోని జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన ఇంటర్మీడియట్ పరీక్షా కేంద్రాన్ని పరిశీలించారు. ఆయన పరీక్షా కేంద్రాల్లో ఏర్పాట్లు, పరీక్షా హాళ్ల పరిస్థితులు, విద్యార్థులకు కల్పించిన సౌకర్యాలు, సీసీ కెమెరా పర్యవేక్షణ, మార్గదర్శకాల అమలును పరిశీలించారు. జిల్లాలో 3,615 మంది విద్యార్థులు పరీక్ష రాసేందుకు 8 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

Similar News

News March 5, 2025

కొత్తగూడెం: రూ.10.30లక్షల గంజాయి పట్టివేత

image

భద్రాచలం పట్టణంలోని ఆర్టీఏ చెక్‌పోస్టు వద్ద మంగళవారం టౌన్‌ పోలీసులు వాహనాల తనిఖీ చేస్తున్న క్రమంలో 2 ద్విచక్ర వాహనాలపై వస్తున్న ముగ్గురు వ్యక్తులను ఆపి తనిఖీ చేయగా వారి వద్ద రూ.10.30 లక్షలు విలువ గల 20 కేజీల గంజాయి పట్టుబడింది. గంజాయిని హైదరాబాద్‌కు తరలిస్తుండగా భద్రాచలంలో పట్టుకున్నట్లు ఎస్ఐ రామకృష్ణ తెలిపారు. వీరంతా సుక్మా జిల్లాకు చెందిన వారిగా విచారణలో తేలిందని ఎస్ఐ పేర్కొన్నారు.

News March 5, 2025

నిజామాబాద్: అలీసాగర్ లిఫ్ట్ కాల్వలో శవం లభ్యం

image

ఎడపల్లి మండలం జాన్కంపేట గ్రామ శివారులో గల అలీసాగర్ లిఫ్ట్ కాల్వ తూము వద్ద వ్యక్తి శవం లభ్యమవడం కలకలం లేపింది. అలీసాగర్ లిఫ్ట్ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించగా, వారు అక్కడికి చేరుకొని గుర్తుతెలియని వ్యక్తిగా కేసు నమోదు చేసి శవాన్ని నిజామాబాద్ ప్రభుత్వాసుపత్రిలోని మార్చురీకి తరలించారు. చనిపోయిన వ్యక్తికి సుమారు 40 ఏళ్ల వయస్సు ఉంటుందని, ఎవరైనా గుర్తిస్తే సమాచారం అందించాలని పోలీసులు తెలిపారు.

News March 5, 2025

కూటమి మద్దతు అభ్యర్థి ఓటమి వారికి చెంపపెట్టు: UTF

image

AP: ఉత్తరాంధ్ర టీచర్ MLC ఎన్నికల్లో వైసీపీ మద్దతిచ్చిన UTF అభ్యర్థి ఓడారంటూ మంత్రి అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలను ఆ సంఘం ఖండించింది. UTFకు రాజకీయాలు అంటగట్టడం సరికాదంది. APTF, PRTU అభ్యర్థులకు కూటమి ముసుగు వేయడం ద్వారా అధికార పక్షమే ఉపాధ్యాయ ఉద్యమంలో చీలికలు తెచ్చిందని విమర్శించింది. కూటమి మద్దతు పలికిన అభ్యర్థి ఓటమి వారు విద్యారంగంలో అనుసరిస్తున్న విధానాలకు చెంపపెట్టు అని పేర్కొంది.

error: Content is protected !!