News March 5, 2025
భూపాలపల్లి: ఇంటర్ విద్యార్థులకు ఎస్పీ సూచనలు

నేడు ఇంటర్ పరీక్షకి హాజరయ్యే అభ్యర్థులు హాల్ టికెట్లో పొందుపరిచిన విధంగా సమయానికి చేరుకోవాలని భూపాలపల్లి జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు తమవెంట పరీక్షా హాల్లోకి సెల్ ఫోన్లు, ట్యాబ్, పెన్ డ్రైవ్, బ్లూటూత్, ఎలక్ట్రానిక్ వాచ్, కాలిక్యులేటర్లు, వాలెట్లు వంటివి తీసుకెళ్లడానికి అనుమతి లేదన్నారు. పరీక్షా కేంద్రంలోకి వెళ్లేముందే పోలీసులు గేటు వద్ద తనిఖీలు నిర్వహిస్తారన్నారు.
Similar News
News September 15, 2025
భద్రాద్రి: ‘సూర్యాంశ్’ నామకరణం చేసిన KTR

అన్నపురెడ్డిపల్లి మాజీ ZPTC దంపతులు లావణ్య-రాంబాబు తమ కుమారుడికి పేరు పెట్టాలని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTRను కలిశారు. దంపతులు ‘సు’ అక్షరంతో పేరు కోరగా, KTR తన కుమారుడు హిమాన్షు పేరును గుర్తు చేసుకుని, సూర్యాంశ్ అని నామకరణం చేశారు. KTR దీవెనలు తమ కొడుకును ఆయనలాగే గొప్ప వ్యక్తిని చేస్తాయన్న నమ్మకం ఉందని తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు. తమ అభిమాన నేతతో గడిపిన క్షణాలను ఎప్పటికీ మర్చిపోలేమన్నారు.
News September 15, 2025
ASF: మల్టీ సర్వీస్ డే కేర్ సెంటర్లో దరఖాస్తుల ఆహ్వానం

సామాజిక న్యాయ, సాధికారత మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు జిల్లాలో వయోవృద్ధుల కోసం మల్టీ సర్వీస్ డే కేర్ సెంటర్ ను ఏర్పాటు చేయనున్నట్లు సంక్షేమ శాఖ కార్యాలయం ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ సెంటర్లో సేవలందించేందుకు సీనియర్ సిటిజన్ అనిసియేషన్, NGOల నుంచి దరఖాస్తు కోరడం జరుగుతుందన్నారు. అనుభవం కలిగిన వారు పూర్తి వివరాలతో ఈనెల 19లోపు జిల్లా సంక్షేమ శాఖ కార్యాలయంలో దరఖాస్తులు చేసుకోవాలన్నారు.
News September 15, 2025
NRPT: ప్రజావాణి అర్జీలను పరిష్కరించాలి: ఎస్పీ

నారాయణపేట ఎస్పీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్ ప్రోగ్రాంలో ఎస్పీ యోగేష్ గౌతమ్ బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ప్రజావాణిలో అందిన అర్జీలను వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆయన ఆదేశించారు. ఫిర్యాదులను పరిశీలించి, చట్ట ప్రకారం తక్షణమే చర్యలు తీసుకోవాలని సూచించారు. మొత్తం 15 ఫిర్యాదులు అందినట్లు ఎస్పీ తెలిపారు.