News March 5, 2025
భూపాలపల్లి: ఇంటర్ విద్యార్థులకు ఎస్పీ సూచనలు

నేడు ఇంటర్ పరీక్షకి హాజరయ్యే అభ్యర్థులు హాల్ టికెట్‌లో పొందుపరిచిన విధంగా సమయానికి చేరుకోవాలని భూపాలపల్లి జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు తమవెంట పరీక్షా హాల్‌లోకి సెల్ ఫోన్లు, ట్యాబ్, పెన్ డ్రైవ్, బ్లూటూత్, ఎలక్ట్రానిక్ వాచ్, కాలిక్యులేటర్లు, వాలెట్లు వంటివి తీసుకెళ్లడానికి అనుమతి లేదన్నారు. పరీక్షా కేంద్రంలోకి వెళ్లేముందే పోలీసులు గేటు వద్ద తనిఖీలు నిర్వహిస్తారన్నారు.
Similar News
News March 22, 2025
జడ్చర్ల: ‘విద్యుత్ సరఫరా లేక ఎండుతున్న పంటలు’

జడ్చర్ల మండలం కిష్టారం గ్రామంలో విద్యుత్ సరఫరా సరిగా లేక నీళ్లు పెట్టకపోవడంతో మొక్కజొన్న, వరి పంటలు ఎండిపోతున్నాయని కిష్టారం గ్రామ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా Way2Newsతో రైతు పి.వెంకటేశ్ మాట్లాడుతూ.. విద్యుత్ సరఫరా సరిగా లేక వేల పెట్టుబడితో పెట్టిన పంటలు ఎండిపోయి నష్టపోతున్నామని, విద్యుత్ అధికారులు స్పందించి 24 గంటలు కరెంట్ సరఫరా చేయాలని అన్నారు.
News March 22, 2025
గద్వాల: ఈ ఫొటోకు ఐదేళ్లు..!

కరోనా కారణంగా జోగులాంబ గద్వాల జిల్లాలో నేటికి జనతా కర్ఫ్యూ విధించి ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా జిల్లాలోని ప్రతి ఒక్కరూ కూడా చాలావరకు సోషల్ మీడియా ద్వారా జనతా కర్ఫ్యూ పేరిట పోస్టులు చేసుకుంటున్నారు. నాటి గద్వాల కర్ఫ్యూపై తీసిన ఫొటో ఐదేళ్లు పూర్తి చేసుకుందని సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్‌గా మారింది.
News March 22, 2025
GNT: సీఎంవోలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

సీఎంవోలో ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన ఫోటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్ల పోస్టుల భర్తీకి శనివారం రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. ఇటీవల జరిగిన కేబినెట్ భేటీలో తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా సీఎంవోలో పనిచేయడానికి ఫోటోగ్రాఫర్లు-3, వీడియోగ్రాఫర్లు-2 పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. వీరికి నెలకు రూ.70,000 వేతనం చెల్లిస్తామని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.