News January 28, 2025
భూపాలపల్లి: ఉపాధ్యాయ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

తెలంగాణ మైనారిటీస్ గురుకుల పాఠశాల & కళాశాలలో ఖాళీగా ఉన్న గణిత శాస్త్రం ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయుటకు అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నట్లు జిల్లా అధికారి శైలజ పేర్కన్నారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ నెల 29 నుంచి 31 వరకు మైనార్టీ గురుకుల పాఠశాల & కళాశాలలో బయోడేటాతో పాటు విద్యార్హత సర్టిఫికెట్లతో హాజరుకావాలని కోరారు.
Similar News
News July 8, 2025
తంగళ్లపల్లి: ఉరి వేసుకుని యువకుడి ఆత్మహత్య

రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం చీర్లవంచ గ్రామపంచాయతీ డంపు యార్డులో ఓ యువకుడు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడిని గ్రామానికి చెందిన గంగు శ్రీనివాస్(22)గా స్థానికులు గుర్తించారు. శ్రీనివాస్ డ్రైవర్గా పనిచేస్తున్నాడని తెలిపారు. సోమవారం రాత్రి ఉరి వేసుకొని మృతి చెందాడు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
News July 8, 2025
ముమ్మిడివరం: గుట్కా అమ్మకాలపై పోలీసులు తనిఖీలు

జిల్లా ఎస్పీ ఆదేశాలతో ముమ్మిడివరంలో మత్తు పదార్ధాలు, సిగరెట్స్, గుట్కా, అమ్మకాలపై మంగళవారం పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ముమ్మిడివరం CI మోహనకుమార్ ఆధ్వర్యంలో స్థానిక ఎస్ఐ జ్వాలా సాగర్ సిబ్బందితో బడ్డిషాపులు, టీ పాయింట్లలో తనిఖీలు జరిపారు. పలు షాపుల యజమానులకు జరిమానాలు విధించారు. మత్తు పదార్థాలు విక్రయించేవారికి పుట్టిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
News July 8, 2025
WGL: మహిళలకు గుడ్ న్యూస్.. రూ.18కోట్లు మంజూరు

రాష్ట్ర ప్రభుత్వం మహిళా సంఘాల్లో రుణాలు తీసుకున్న సభ్యులకు గుడ్ న్యూస్ చెప్పింది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో రుణాలకు సంబంధించిన వడ్డీని మంజూరు చేసింది. ఉమ్మడి జిల్లాకు సంబంధించి సెర్ప్ పరిధిలో రూ.18 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. మహిళా శక్తి సంబరాల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ డబ్బులను మహిళల ఖాతాల్లో జమ చేయనుంది. వడ్డీ నిధులను మంజూరు చేయడం పట్ల మహిళా సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.