News March 20, 2025
భూపాలపల్లి: కాళేశ్వరానికి భారీ నిధులు

రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలోని కాళేశ్వరం, దేవాదుల సహా పలు ప్రధాన ప్రాజెక్టుల అభివృద్ధికి పెద్ద మొత్తంలో నిధులు కేటాయించింది. ఉమ్మడి వరంగల్ రూ. 4028.59కోట్లు ఇస్తున్నట్లు ప్రకటించగా ఇందులో సింహభాగం కాళేశ్వరానికి రూ.2,685కోట్లు ఇచ్చింది. దీంతో పెడింగ్‌లోని ప్రాజెక్టులు పనులు పూర్తికానున్నాయి.
Similar News
News February 23, 2026
తాండూరులో పట్టపగలే దారుణ హత్య

తాండూరు మండలం కరణ్కోట్లో సోమవారం పట్టపగలే దారుణం చోటుచేసుకుంది. స్థానిక ఆటో డ్రైవర్ సాయిలు (45)ను ఓ యువకుడు కత్తితో వెంబడించి మరీ కిరాతకంగా నరికి చంపాడు. ఈ ఘటనతో ఒక్కసారిగా గ్రామంలో భయాందోళనలు నెలకొన్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ప్రాథమిక విచారణ చేపట్టారు. పాత కక్షలా లేక మరేదైనా కారణమా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
News February 23, 2026
పాలు, నూనెల నమూనాల రిపోర్టు వెంటనే ఇవ్వాలి: సత్యకుమార్

AP: రాజమండ్రిలో సేకరించిన పాలు, నూనెల పరీక్ష పూర్తిచేసి వెంటనే నివేదిక అందించాలని మంత్రి సత్యకుమార్ అధికారులను ఆదేశించారు. కల్తీపాలతో మరణాల నేపథ్యంలో వైద్య, ఫుడ్ సేఫ్టీ అధికారులతో మంత్రి చర్చించారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. కాగా ఆ నమూనాలతో పాటు బాధితుల రక్తనమూనాలను కూడా ల్యాబ్‌లకు పంపామని అధికారులు తెలిపారు. నివేదిక వస్తే పాలలో రసాయనాల కల్తీ నిర్ధారణ అవుతుందన్నారు.
News February 23, 2026
భూపాలపల్లి: ప్రజావాణిలో 44 దరఖాస్తుల స్వీకరణ

ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రాహుల్ శర్మ అన్ని శాఖల అధికారులను ఆదేశించారు. సోమవారం ఐడీఓసీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి మొత్తం 44 దరఖాస్తులు స్వీకరించి తక్షణ చర్యలకు సంబంధించిన అధికారులకు ఎండార్స్మెంట్ చేసినట్లు తెలిపారు. ఆయా దరఖాస్తులను వెంటనే పరిశీలించి పరిష్కరించాలని సూచించారు.


