News March 18, 2025

భూపాలపల్లి: కుష్టు వ్యాధి నిర్మూలనకు కృషి చేయాలి: వైద్యాధికారి 

image

కుష్టు వ్యాధి నిర్మూలనకు కృషి చేయాలని జిల్లా వైద్యాధికారి డా.మధుసూదన్ పిలుపునిచ్చారు. మంగళవారం తన కార్యాలయంలో జరిగిన సమీక్షలో కుష్టి వ్యాధి గురించి తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. జాతీయ కుష్టు వ్యాధి నిర్మూలన కార్యక్రమంలో భాగంగా ఈనెల 17 నుంచి 30 వరకు జిల్లా వ్యాప్తంగా నిర్వహించే సర్వేకు సహకరించాలని కోరారు. వ్యాధి గ్రస్థులకు ప్రభుత్వం రూ.12 వేల చొప్పున అందిస్తుందని అన్నారు.

Similar News

News December 8, 2025

జగిత్యాల: బస్సు ఛార్జీలు ఇస్తాం.. వచ్చి ఓటేయండి

image

జగిత్యాల జిల్లాలో సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ప్రతి ఓటు అభ్యర్థులకు కీలకం కావడంతో ఓట్లు వేయించుకోవడానికి అభ్యర్థులు నానా తంటాలు పడుతున్నారు. గ్రామానికి చెందిన ఓటర్లు ఇతర ప్రాంతాలలో ఉంటే వారికి ఫోన్లు చేసి గ్రామానికి వచ్చి తనకు ఓటు వేసి వెళ్తే బస్సు ఛార్జీలు ఇస్తామని, వచ్చి ఓటేయండని ప్రాధేయపడుతున్నారు. దీంతో వస్తామని కొందరు, ఒక్క ఓటు కోసం ఏం వస్తాంలే అని మరికొందరంటున్నారు.

News December 8, 2025

ప్రెగ్నెన్సీలో మందులతో జాగ్రత్త

image

గర్భం దాల్చినప్పటి నుంచి ప్రసవం వరకు మహిళలు ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఈ సమయంలో మందుల వాడకంపై అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు నిపుణులు. దీర్ఘకాలిక వ్యాధులకు సంబంధించిన మందులు, యాంటీబయాటిక్స్ వాడే ముందు వైద్యుల సలహా తప్పనిసరిగా తీసుకోవాలి. ఇష్టం వచ్చినట్టు మందులు కొనుక్కొని వాడకూడదు. డాక్టర్లు ప్రిస్క్రైబ్​ చేస్తేనే వాడాలని చెబుతున్నారు.

News December 8, 2025

ప్లానింగ్ లేకపోవడం వల్లే ఇండిగో సంక్షోభం: రామ్మోహన్

image

సిబ్బంది రోస్టర్లు, అంతర్గత ప్లానింగ్ వ్యవస్థలో సమస్యల వల్లే ఇండిగో విమానాల సంక్షోభం ఏర్పడిందని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు చెప్పారు. ‘కఠినమైన సివిల్ ఏవియేషన్ రిక్వైర్‌మెంట్స్ (CARs) అమలులో ఉన్నాయి. వాటిని ఎయిర్‌లైన్ ఆపరేటర్లు పాటించాలి. ఈ రంగంలో నిరంతరం సాంకేతికత అప్‌గ్రేడేషన్ జరుగుతోంది. దేశంలో విమానయాన రంగానికి ప్రపంచస్థాయి ప్రమాణాలు ఉండాలనేదే మా విజన్’ అని రాజ్యసభలో తెలిపారు.