News March 19, 2025

భూపాలపల్లి: కుష్టు వ్యాధి నిర్మూలనకు కృషి చేయాలి: వైద్యాధికారి 

image

కుష్టు వ్యాధి నిర్మూలనకు కృషి చేయాలని జిల్లా వైద్యాధికారి డా.మధుసూదన్ పిలుపునిచ్చారు. మంగళవారం తన కార్యాలయంలో జరిగిన సమీక్షలో కుష్టి వ్యాధిపై పలు సూచనలు చేశారు. జాతీయ కుష్టు వ్యాధి నిర్మూలన కార్యక్రమంలో భాగంగా ఈనెల 17 నుంచి 30 వరకు జిల్లా వ్యాప్తంగా నిర్వహించే సర్వేకు సహకరించాలని కోరారు. వ్యాధిగ్రస్థులకు ప్రభుత్వం రూ.12 వేల చొప్పున అందిస్తుందన్నారు.

Similar News

News November 24, 2025

హైకమాండ్ కోరుకుంటే సీఎంగా కొనసాగుతా: సిద్దరామయ్య

image

కాంగ్రెస్ హైకమాండ్ కోరుకుంటే తాను ముఖ్యమంత్రిగా కొనసాగుతానని కర్ణాటక సీఎం సిద్దరామయ్య అన్నారు. మార్పులు ఏవైనా కేంద్ర నాయకత్వం తీసుకునే నిర్ణయంపైనే ఆధారపడి ఉంటాయని చెప్పారు. వారు ఏం చెప్పినా తాను, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ అంగీకరించాల్సిందేనని తెలిపారు. క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణకు 4-5 నెలల కిందటే హైకమాండ్ ఒప్పుకుందని, అయితే 2.5 ఏళ్ల టర్మ్ పూర్తయ్యేదాకా ఆగాలని చెప్పిందని పేర్కొన్నారు.

News November 24, 2025

సిద్దిపేట: అకాల వర్షాలు.. అలర్ట్‌గా ఉండండి: కలెక్టర్

image

జిల్లాలో రాబోయే నాలుగు రోజుల్లో అకాల వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున, అధికారులందరూ అలెర్ట్‌గా ఉండాలని కలెక్టర్ కె. హైమావతి ఆదేశించారు. సోమవారం జిల్లా అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్‌తో కలిసి అన్ని శాఖల అధికారులకు కీలక సూచనలు చేశారు. వర్షాల నుంచి ధాన్యం తడవకుండా రైతులకు వెంటనే టార్పాలిన్ కవర్లు అందజేయాలని కలెక్టర్ ఆదేశించారు. అకాల వర్షాల వల్ల పంట నష్టం జరగకుండా చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు.

News November 24, 2025

భారతీయ సినిమాలో ఒక శకం ముగిసింది: ప్రధాని మోదీ

image

ధర్మేంద్ర మరణంతో భారతీయ సినిమాలో ఒక శకం ముగిసిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. నటనతో అనేక పాత్రలకు ఆయన ప్రాణం పోశారని కొనియాడారు. ధర్మేంద్ర కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్టు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ట్వీట్ చేశారు. ధర్మేంద్ర మృతికి బాలీవుడ్ డైరెక్టర్, నిర్మాత కరణ్ జోహార్, టాలీవుడ్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్, తదితరులు సంతాపం తెలిపారు.