News March 31, 2025
భూపాలపల్లి: ‘కొలువుల ధీరుడు’కి 10వ ప్రభుత్వ ఉద్యోగం

చిట్యాల మండలం గుంటూరుపల్లి గ్రామానికి చెందిన వెల్ది గోపికృష్ణ టీజీపీఎస్సీ విడుదల చేసిన గ్రూపు-1 ఫలితాల్లో 493.5 మార్కులు సాధించి రాష్ట్రస్థాయిలో 70వ ర్యాంకర్‌గా నిలిచారు. కేంద్ర ప్రభుత్వంలో 07, రాష్ట్ర ప్రభుత్వంలో 3వ ప్రభుత్వ ఉద్యోగం సాధించాడు. ప్రస్తుతం గోపికృష్ణ ఖమ్మం మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్గా ఇటీవల ఆర్డర్ కాపీ తీసుకొని తెలంగాణ పోలీస్ అకాడమీలో ట్రైనింగ్ పొందుతున్నాడు.
Similar News
News September 18, 2025
విద్యార్థిపై దాడి.. పవన్ కళ్యాణ్ విచారం

పుంగనూరులోని ఓప్రైవేటు స్కూల్లో ఆరో తరగతి చదువుతున్న విద్యార్థిని సాత్విక నాగశ్రీ తలపై ఉపాధ్యాయుడు కొట్టడంతో విద్యార్థి తల ఎముక చిట్లడంతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విచారం వ్యక్తం చేశారు. స్కూల్, ఇంట్లో పిల్లలు అల్లరి చేయడం లాంటివి చేస్తే వారి మానసిక ధోరణిని ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు అర్థం చేసుకోవాలన్నారు. విద్యార్థికి సమస్యలు తలెత్తడంతో ఈ ఘటనపై విచారణ చేపట్టాలని బుధవారం అధికారులను ఆదేశించారు.
News September 18, 2025
ఎంజీయూలో వివిధ విభాగాలకు నూతన అధిపతుల నియామకం

మహాత్మా గాంధీ యూనివర్సిటీలోని వివిధ విభాగాలకు నూతన అధిపతులను నియమిస్తూ రిజిస్ట్రార్ ఆచార్య అల్వాల రవి ఉత్తర్వులు జారీ చేశారు. రసాయన శాస్త్ర విభాగానికి డా. ఎం.జ్యోతి, గణిత శాస్త్ర విభాగానికి డా. జి.ఉపేందర్‌రెడ్డి, భౌతిక శాస్త్ర విభాగానికి డా. శాంత కుమారి, రసాయన శాస్త్ర విభాగం బీఓఎస్ (బోర్డ్ ఆఫ్ స్టడీస్)గా డా. ఆర్.రూప నియమితులయ్యారు. వీరు రెండేళ్ల పాటు ఆయా విభాగాలకు అధిపతులుగా వ్యవహరిస్తారు.
News September 18, 2025
HYD: ప్రాణాలు పోతున్నా.. మారని పరిస్థితి..!

హైదరాబాద్‌లో మ్యాన్‌హోల్స్‌లో పడి అనేక మంది ప్రాణాలు పోతున్నప్పటికీ పరిస్థితిలో మార్పు రావడం లేదని నగర ప్రజలు విమర్శిస్తున్నారు. గతంలో డ్రైనేజీ మ్యాన్‌హోల్‌లో పడి అనేక మంది మరణించారు. ఇటీవల ఓ చిన్నారి సైతం మ్యాన్‌హోల్‌లో పడింది. అదృష్టవశాత్తు ప్రాణాలు దక్కాయి. బహదూర్‌పుర నుంచి కిషన్‌బాగ్ రోడ్డులో ఈ పరిస్థితి నిర్లక్ష్యానికి నిదర్శనం.