News March 31, 2025
భూపాలపల్లి: ‘కొలువుల ధీరుడు’కి 10వ ప్రభుత్వ ఉద్యోగం

చిట్యాల మండలం గుంటూరుపల్లి గ్రామానికి చెందిన వెల్ది గోపికృష్ణ టీజీపీఎస్సీ విడుదల చేసిన గ్రూపు-1 ఫలితాల్లో 493.5 మార్కులు సాధించి రాష్ట్రస్థాయిలో 70వ ర్యాంకర్గా నిలిచారు. కేంద్ర ప్రభుత్వంలో 07, రాష్ట్ర ప్రభుత్వంలో 3వ ప్రభుత్వ ఉద్యోగం సాధించాడు. ప్రస్తుతం గోపికృష్ణ ఖమ్మం మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్గా ఇటీవల ఆర్డర్ కాపీ తీసుకొని తెలంగాణ పోలీస్ అకాడమీలో ట్రైనింగ్ పొందుతున్నాడు.
Similar News
News September 16, 2025
పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కు బ్యాడ్ న్యూస్!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సుజిత్ కాంబినేషన్లో రూపొందించిన చిత్రం ‘OG’. ఈ మూవీకి తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి ప్రీమియర్ షోస్ ఉండకపోవచ్చని సినీ వర్గాలు తెలిపాయి. సినిమా రిలీజ్ తేదీ 25న అర్ధరాత్రి ఒంటి గంటకు లేదా తెల్లవారుజామున 4 గంటలకు షోస్ ఉండే అవకాశం ఉందని పేర్కొన్నాయి. దీనిపై మేకర్స్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, సాంగ్స్ సినిమాపై అంచనాలను భారీగా పెంచాయి.
News September 16, 2025
రెడ్డిగూడెం: డీఎస్సీలో ఎంపికై భార్య చివరి కోరిక తీర్చిన భర్త

తన భర్తను ఉపాధ్యాయుడిగా చూడాలన్న భార్య చివరి కోరికను పట్టుదలతో నెరవేర్చాడు రెడ్డిగూడెం (M) రెడ్డికుంటకు చెందిన ఆరేపల్లి రామకృష్ణ. ఏడాది క్రితం రామకృష్ణ భార్య డెంగీతో మరణించారు. తన చివరి కోరికను నెరవేర్చడానికి రోజుకు 17 గంటలు కష్టపడి చదివారు. 70.02 మార్కులతో BC-D రిజర్వేషన్ కోటాలో స్కూల్ అసిస్టెంట్ (బయాలజీ)గా డీఎస్సీలో ఎంపికయ్యారు. తన భార్య బతికి ఉంటే ఎంతో సంతోషించేదని ఆయన కన్నీటి పర్యంతమయ్యారు.
News September 16, 2025
ACS అధికారిణి ఇంట్లో నోట్ల కట్టలు.. అరెస్టు

ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారని అస్సాం సివిల్ సర్వీస్ అధికారిణి నూపుర్ బోరాను పోలీసులు అరెస్ట్ చేశారు. నిన్న ఆమె ఇంట్లో సోదాలు నిర్వహించి రూ.కోటికి పైగా నగదు, రూ.కోటి విలువ చేసే ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. వివాదాస్పద భూ సంబంధిత అంశాలలో ప్రమేయం ఉందనే ఆరోపణలతో 6 నెలలుగా ఆమెపై ప్రత్యేక విజిలెన్స్ సెల్ నిఘా పెట్టినట్లు ఆ రాష్ట్ర సీఎం హిమంత బిశ్వ శర్మ తెలిపారు.