News February 26, 2025
భూపాలపల్లి: క్వింటాల్కు రూ.25 వేలు మద్దతు ధర కల్పించాలి: గండ్ర

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి పర్యటించిన విషయం తెలిసిందే. రైతులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. మద్దతు ధర లేక రైతులు సతమతమవుతున్నారని, క్వింటాల్కు రూ.25 వేల వరకు మద్దతు ధర కల్పించాలని ప్రభుత్వాలని ఆయన డిమాండ్ చేశారు. మద్దతు ధరలు లేక మొగుళ్లపల్లి మండలంలో రైతు నిన్న ఆత్మహత్య చేసుకున్న విషయాన్ని గుర్తు చేశారు. న్యాయం చేయాలన్నారు.
Similar News
News November 26, 2025
కర్నూలు జిల్లా నుంచి అధ్యక్షా.. అనేది వీరే..!

సంవిధాన్ దివస్-రాజ్యాంగ దినోత్సవ వేడుకల్లో భాగంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ విద్యార్థులకు అసెంబ్లీలో మాట్లాడే అవకాశాన్ని (మాక్ అసెంబ్లీ) కల్పించారు. బుధవారం కర్నూలు జిల్లా నుంచి అసెంబ్లీలో మాట్లాడేందుకు జిల్లా ఎమ్మెల్యేలు (విద్యార్థులు) సిద్ధమయ్యారు. దయాన, లోకేశ్వర్ రెడ్డి, గాయత్రి, నవనీత్ కుమార్, వీరేంద్ర, గౌతమి, ప్రవీణ్ ప్రజా సమస్యలపై తమ గొంతు వినిపించనున్నారు.
News November 26, 2025
తుదిదశకు రోడ్ల వెడల్పు శిథిలాల తొలగింపు

వేములవాడ పట్టణంలో రోడ్ల వెడల్పుకు సంబంధించిన శిథిలాల తొలగింపు ప్రక్రియ తుదిదశకు చేరుకుంది. రూ.42 కోట్ల అంచనా వ్యయంతో పట్టణంలోని మెయిన్ రోడ్డును 80 అడుగుల మేరకు విస్తరిస్తున్నారు. ఇందుకోసం రోడ్డుకు ఇరువైపులా సుమారు 180 ఇండ్లను తొలగించారు. సాంకేతిక కారణాలతో నిలిచిపోయిన కూల్చివేతలు తిరిగి ప్రారంభం కాగా వాటికి సంబంధించిన శిథిలాలను జేసీబీ సహాయంతో తొలగిస్తున్నారు.
News November 26, 2025
వరంగల్: కోతుల పంచాయితీ తీరిస్తేనే.. గ్రామ పంచాయతీకి!

ఉమ్మడి వరంగల్లో కోతుల బెడద తీవ్రమవడంతో గ్రామ పంచాయితీ ఎన్నికలకే కొత్త పేరొచ్చింది. కోతుల పంచాయితీ తీరిస్తేనే గ్రామ పంచాయితీ ఎన్నికల్లో పోటీ చేయాలనే డిమాండ్ పెరుగుతోంది. ఎంపీటీసీ ఎన్నికలు వాయిదా పడటం, ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలే ముందుకు రావడంతో, కోతుల సమస్యను ఎవరు పరిష్కరిస్తారో వారికే ఓటు వేయాలని ప్రజలు భావిస్తున్నారు. పంటలు నాశనం, ఇళ్లలోకి చొరబాటు, కోతుల దాడులతో గ్రామాలు ఇబ్బందులు పడుతున్నాయి.


