News April 13, 2025
భూపాలపల్లి: గొడ్డలితో దారుణహత్య

భూపాలపల్లి జిల్లా కాటారం మండలం ఆదివారం పేట గ్రామంలో శనివారం అర్ధరాత్రి దారుణమైన హత్య జరిగింది. ఒంటరిగా ఉంటున్న ఒలేటి మల్లమ్మ(70) వృద్ధురాలిని గుర్తుతెలియని వ్యక్తి గొడ్డలితో నరికి చంపాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది
Similar News
News September 17, 2025
బుల్లెట్ రైలు ప్రాజెక్టు.. మట్టి నమూనాల సేకరణ

హైదరాబాద్-చెన్నై మార్గంలో నిర్మించతలపెట్టిన హైస్పీడ్ ఎలివేటెడ్ రైల్ కారిడార్ ప్రాజెక్టులో భాగంగా, గుంటూరు జిల్లాలో ఫైనల్ లొకేషన్ సర్వే బుధవారం ప్రారంభమైంది. దీనిలో భాగంగా వట్టిచెరుకూరు, కాకుమాను మండలాల్లో మట్టి నమూనాలు సేకరిస్తున్నారు. DPR రూపొందించడం, ఫైనల్ ఎలైన్మెంట్ డిజైన్ కోసం ఈ సర్వే నిర్వహిస్తున్నారు. ఈ సర్వేలో భాగంగా, 20 మీటర్ల లోతులో ప్రతి 5 మీటర్లకు ఒకసారి మట్టి నమూనాలను సేకరిస్తున్నారు.
News September 17, 2025
బేగంపేట ఎయిర్‌పోర్టులో రాజ్‌నాథ్‌కు వీడ్కోలు

కేంద్రమంత్రి రాజ్ నాథ్ సింగ్ హైదరాబాద్ పర్యటన ముగిసింది. పర్యటన అనంతరం తిరిగి ఢిల్లీ వెళుతున్న సందర్భంగా బేగంపేట విమానాశ్రయంలో కిషన్ రెడ్డి, రాష్ట్ర BJP అధ్యక్షుడు రామచంద్ర రావు, జిల్లా కలెక్టర్ హరి చందన దాసరి ఆయనకు వీడ్కోలు పలికారు. ఈ కార్యక్రమంలో DCP రష్మీ పెరుమల్, డిఫెన్స్ ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు.
News September 17, 2025
నా రాజీనామాను ఇంకా ఆమోదించలేదు: కవిత

TG: MLC పదవికి తన రాజీనామాను ఇంకా ఆమోదించలేదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత తెలిపారు. శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అందుబాటులో లేరని చెప్పారు. ‘రాజీనామాను ఆమోదించిన 6 నెలల్లో ఎన్నికలు నిర్వహించాలి. ఇప్పుడు ఆ పరిస్థితి లేదని అంటున్నారు. నేను ఎన్నికైనప్పుడు ఆ సీటు 6 నెలలకు పైగా ఖాళీగానే ఉంది. అవసరమైతే ఛైర్మన్‌ను మళ్లీ కలుస్తా’ అని మీడియా చిట్ చాట్‌లో వ్యాఖ్యానించారు.