News April 13, 2025
భూపాలపల్లి: గొడ్డలితో దారుణహత్య

భూపాలపల్లి జిల్లా కాటారం మండలం ఆదివారం పేట గ్రామంలో శనివారం అర్ధరాత్రి దారుణమైన హత్య జరిగింది. ఒంటరిగా ఉంటున్న ఒలేటి మల్లమ్మ(70) వృద్ధురాలిని గుర్తుతెలియని వ్యక్తి గొడ్డలితో నరికి చంపాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News April 18, 2026
MNCL: 20 నుంచి ఓపెన్ పరీక్షలు

ఓపెన్ స్కూల్ పదో తరగతి, ఇంటర్ పరీక్షలు ఈ నెల 20 నుంచి 27వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు మంచిర్యాల డీఈవో యాదయ్య తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పరీక్షలు జరుగుతాయన్నారు. పదవ తరగతిలో 654 మంది, ఇంటర్‌లో 1226 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నట్లు పేర్కొన్నారు. హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకోవాలని సూచించారు.
News April 18, 2026
పూరీ జగన్నాథ్ ‘స్లమ్ డాగ్’కు ఓటీటీ కష్టాలు?

వరుస ఫ్లాపులతో ఇబ్బంది పడుతున్న డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కొత్త చిత్రం ‘స్లమ్ డాగ్’పై ఆశలు పెట్టుకున్నారు. విజయ్ సేతుపతి లీడ్ రోల్ చేసిన ఈ మూవీ షూటింగ్ ఇప్పటికే ముగిసినా రిలీజ్ ప్రకటన వెలువడటం లేదు. దీనికి ఓటీటీ డీల్ క్లోజ్ కాకపోవడమే కారణమని సమాచారం. ప్రస్తుతం పలు ఓటీటీ సంస్థలతో చర్చలు కొనసాగుతున్నాయని తెలుస్తోంది. డీల్ పూర్తయ్యాకే విడుదల ప్రకటన వచ్చే అవకాశం ఉంది.
News April 18, 2026
ANU: ఫిజికల్ ఎడ్యుకేషన్ 1వ సెమిస్టర్ పరీక్ష ఫలితాలు విడుదల

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిధిలో ఫిబ్రవరి నెలలో జరిగిన ఫిజికల్ ఎడ్యుకేషన్ ఒకటో సెమిస్టర్ రెగ్యులర్ పరీక్ష ఫలితాలను పరీక్షల నియంత్రణ అధికారి ఆలపాటి శివప్రసాదరావు శనివారం విడుదల చేశారు. BPEdలో 90.48%, DPEdలో 92.86%, MPEdలో 94.50% విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు తెలిపారు. రీవాల్యుయేషన్ ఫీజు, చివరి తేదీ, వివరాలకు వర్సిటీ వెబ్సైట్ https://www.nagarjunauniversity.ac.inను సంప్రదించాలన్నారు.


