News March 31, 2025

భూపాలపల్లి: గ్రామాల్లో జోరుగా పైరవీలు..?

image

భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా జరిగిన ప్రజాపాలనలో ప్రజలు ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. కానీ, ప్రభుత్వం ఇప్పటివరకు లబ్ధిదారుల లిస్ట్‌ను ఫైనల్ చేయలేదు.కాగా నియోజకవర్గానికి 3,500 ఇళ్లు మంజూరైన విషయం తెలిసిందే. దీంతో జిల్లాలోని అధికార పార్టీకి చెందిన చోటామోటా నాయకులు ఇళ్లు ఇప్పిస్తామని పైరవీలు సాగిస్తున్నట్లు సమాచారం. అసలైన అర్హులు తమకు ఇందిరమ్మ ఇల్లు వస్తుందో, రాదో అని ఆందోళన చెందుతున్నారు.

Similar News

News December 3, 2025

ముగింపు ‘అఖండ-2’ తాండవమేనా!

image

ఈ ఏడాదిలో ఇప్పటివరకు టాలీవుడ్ నుంచి విడుదలైన చిత్రాల్లో సంక్రాంతికి వస్తున్నాం, OG బాక్సాఫీసు వద్ద రూ.300 కోట్లకుపైగా వసూళ్లు రాబట్టాయి. భారీ అంచనాలతో విడుదలైన గేమ్ ఛేంజర్ ఆకట్టుకోలేకపోయింది. డిసెంబర్‌లో బడా చిత్రాల్లో ‘అఖండ-2’తో ఈ ఏడాదికి ముగింపు పలకనుంది. సినిమాపై ఉన్న బజ్ కలెక్షన్లపై ఆశలు రేకెత్తిస్తున్నా బాలయ్య మూవీ రికార్డులు సృష్టిస్తుందా అనేది మరికొద్ది రోజుల్లో తేలనుంది.

News December 3, 2025

GDK: మహిళలు, అమ్మాయిలు ఈ నంబర్లు SAVE చేసుకోండి

image

రామగుండం కమిషనరేట్ షీ టీమ్స్‌కు నవంబర్‌లో 68 ఫిర్యాదులు వచ్చినట్లు సీపీ అంబర్ కిషోర్ ఝా ఒక ప్రకటనలో తెలిపారు. 68 పిటిషన్లలో 15 పిటిషన్లు రామగుండం షీ టీమ్స్‌కు వాట్సాప్ ద్వారా, మిగతా 53 నేరుగా వచ్చాయని వివరించారు. మహిళలు, విద్యార్థినులు అత్యవసర పరిస్థితుల్లో 6303923700, 8712659386, 8712659386 నంబర్ల ద్వారా షీ టీంలను సంప్రదించాలని సీపీ సూచించారు. SHARE IT.

News December 3, 2025

కల్వకుర్తి ఆస్పత్రి.. 24 గంటల్లో 20 కాన్పులు

image

కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రిలో గడచిన 24 గంటలలో 20 కాన్పులు జరిగినట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శివరాం తెలిపారు. ఇందులో 11 నార్మల్ డెలివరీలు, 9 సిజేరియన్ కాన్పులు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. తల్లీబిడ్డలు క్షేమంగా ఉన్నారని తెలిపారు. ఇంత పెద్ద సంఖ్యలో విజయవంతంగా కాన్పులు చేసిన ఆసుపత్రి సిబ్బందిని సూపరింటెండెంట్ అభినందించారు.