News March 24, 2025
భూపాలపల్లి జిల్లాకు ఎల్లో అలర్ట్

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా సోమవారం వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ మేరకు భూపాలపల్లి జిల్లాకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. రెండు రోజుల పాటు జిల్లాలో ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదవుతాయని, ఆ తర్వాత క్రమంగా 2-3 డిగ్రీలు పెరుగుతాయని తెలిపింది. రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
Similar News
News November 23, 2025
సిరిసిల్ల డీఎస్పీగా నాగేంద్ర చారి నియామకం

సిరిసిల్ల సబ్ డివిజనల్ పోలీస్ అధికారిగా కే.నాగేంద్ర చారి నియమితులయ్యారు. ప్రస్తుతం ఇక్కడ పనిచేస్తున్న చంద్రశేఖర్ రెడ్డిని డీజీపీ కార్యాలయంలో రిపోర్టు చేయాలని ఆదేశించారు. నిజామాబాద్ సీసీఎస్ విభాగంలో పనిచేస్తున్న నాగేంద్ర చారిని సిరిసిల్లకు బదిలీ చేశారు. నాగేంద్ర చారి గతంలో వేములవాడ డీఎస్పీగా విధులు నిర్వర్తించారు.
News November 23, 2025
మధ్యవర్తిత్వం వేగవంతమైన న్యాయానికి కీలకం: జస్టిస్ లక్ష్మణ్

కేసుల భారాన్ని తగ్గించి, వేగవంతమైన న్యాయం అందించడంలో మధ్యవర్తిత్వం (మెడియేషన్) కీలక పాత్ర పోషిస్తుందని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె. లక్ష్మణ్ అన్నారు. ఎంజీ యూనివర్సిటీలో న్యాయవాదుల శిక్షణ తరగతులు ప్రారంభిస్తూ ఆయన మాట్లాడారు. మధ్యవర్తిత్వం ద్వారా కోర్టు బయటే తక్కువ ఖర్చుతో, సంబంధాలు కాపాడుతూ పరిష్కారం పొందవచ్చని సూచించారు. న్యాయవాదులు శిక్షణను సద్వినియోగం చేసుకోవాలన్నారు.
News November 23, 2025
NZB: పల్లెల్లో టెన్షన్ టెన్షన్.. రిజర్వేషన్లు మారితే..!

గ్రామ పంచాయితీ రిజర్వేషన్లు నేడు ఖరారు కానున్నాయి. మళ్లీ పల్లెల్లో సందడి, టెన్షన్ కనిపిస్తోంది. 2011 జనాభా లెక్కలతో సర్పంచి స్థానాలకు ఆర్డీవోలు, కులగణనతో వార్డులకు ఎంపీడీఓలు రిజర్వేషన్లు ఖరారు చేస్తారు. 50 శాతం రిజర్వేషన్లు మించకుండా BC, SC, STలకు కేటాయిస్తారు. ఆపై మహిళలకు 50 శాతం స్థానాలు లక్కీ డ్రా తీస్తారు. రిజర్వేషన్లు మారితే లీడర్లు తమ భార్యలు, తల్లులను బరిలోకి దింపే ప్లాన్ చేస్తున్నారు.


