News June 19, 2024
భూపాలపల్లి జిల్లాలో కీచక ఎస్ఐ!

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఓ కీచక ఎస్ఐ లైంగిక వేధింపుల ఆరోపణ వెలుగులోకి వచ్చాయి. కాటారం సబ్డివిజన్లోని ఓ మండలంలో విధులు నిర్వహిస్తున్న ఎస్ఐ మహిళ కానిస్టేబుల్ ను లైంగికంగా వేధించేవాడని ఆమె ఫిర్యాదు చేసింది. కాగా సదరు ఎస్ఐపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైనట్లు సమాచారం. ఎస్ఐ సర్వీస్ రివాల్వర్ డీఎస్పీ స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.
Similar News
News November 22, 2025
మహిళలు సంఘటితంగా ముందుకు సాగాలి: కలెక్టర్

మహిళలు సంఘటితంగా ముందుకు సాగాలని వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద అన్నారు. ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో ఆమె హాజరై మహిళలను ఉద్దేశించి మాట్లాడారు. మహిళలందరికీ రెండు రకాల చీరలను అందిస్తున్నారని, అందరూ సమానత్వమనే భావన కలిగి ఉండేలా మొత్తం ఈ రంగులను ఎంపిక చేసినట్లు తెలిపారు. మహిళలు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగినప్పుడే అనుకుంది సాధించగలుగుతారని అన్నారు.
News November 22, 2025
‘మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడమే సీఎం లక్ష్యం’

దేశ ప్రగతి మహిళల అభివృద్ధిపైనే ఆధారపడి ఉందని ఎంపీ కడియం కావ్య అన్నారు. హనుమకొండలో జరిగిన ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. రాష్ట్రంలో కోటి మంది మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడమే సీఎం రేవంత్ రెడ్డి ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. మహిళా సంఘాలకు వడ్డీలేని రుణాలు, పెట్రోల్ బంకులు, సోలార్ యూనిట్లు ఏర్పాటుతో పాటు పారిశ్రామిక అవకాశాలు కూడా కల్పిస్తున్నట్లు తెలిపారు.
News November 22, 2025
ఖిలా వరంగల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం తనిఖీ

ఉర్సు గుట్ట వద్ద ఉన్న ఖిలా వరంగల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని జిల్లా రిజిస్ట్రార్ ప్రవీణ్ కుమార్ శనివారం మధ్యాహ్నం తనిఖీ చేశారు. ఆస్తుల రిజిస్ట్రేషన్, స్టాంప్ డ్యూటీ వసూలు, రికార్డుల నిర్వహణ సక్రమంగా ఉన్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు. రిజిస్ట్రేషన్ పత్రాల ఆన్లైన్ ప్రక్రియను పరిశీలించారు. రిజిస్ట్రేషన్ కోసం వచ్చే వారికి ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులకు సూచించారు.


