News March 16, 2025

భూపాలపల్లి జిల్లాలో కేజీ చికెన్ ధర ఎంతంటే?

image

భూపాలపల్లి జిల్లాలో బర్డ్ ఫ్లూ భయం కొంతమేరకు ఉంది. కొంతమంది చేపలు, మటన్ వైపు మొగ్గు చూపుతుంటే, మరికొందరు చికెన్ కొనుగోలు చేసి తింటున్నారు. జిల్లాలో చికెన్ ధరల్లో ప్రాంతాన్ని బట్టి మార్పులు ఇలా ఉన్నాయి. కేజీ చికెన్ రూ.210 ఉండగా.. స్కిన్లెస్ రూ.230గా ఉంది. హోల్‌సేల్ రూ.80-90 ఉండగా.. రిటైల్ రూ.130 వరకు పలుకుతోంది. ఈ చికెన్ ధరల్లో జిల్లాలోని పలు ప్రాంతాల్లో మార్పులు సైతం ఉన్నాయని వ్యాపారులు తెలిపారు.

Similar News

News October 27, 2025

జిల్లా రెవెన్యూ అధికారిగా విజయ్ బాధ్యతలు

image

నెల్లూరు జిల్లా రెవెన్యూ అధికారిగా విజయ్ కుమార్ బాధ్యతలు చేపట్టారు. సోమవారం కలెక్టరేట్లోని డీఆర్ఓ ఛాంబర్‌లో బాధ్యతలు స్వీకరించిన ఆయనకు కలెక్టరేట్ పరిపాలన అధికారి తుమ్మా విజయ్ కుమార్ బొకే అందించి అభినందించారు. అనంతరం పలు సమస్యలను అయన దృష్టికి తీసుకెళ్లారు. జిల్లాలో రెవెన్యూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని విజయ్ తెలిపారు.

News October 27, 2025

ఏసీబీ వలలో జీవీఎంసీ ఆర్‌ఐ, సచివాలయ సెక్రటరీ

image

విశాఖలో ఇద్దరు అధికారులు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యండెడ్‌గా చిక్కారు. తగరపువలస దగ్గర సచివాలయంలో విధులు నిర్వహిస్తున్న సెక్రటరీ సోమ నాయుడు, జీవీఎంసీ ఆర్ఐ రాజును సోమవారం సాయంత్రం ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. లంచానికి సంబంధించిన కేసు విషయంలో ఆరా తీస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News October 27, 2025

ఏలూరు జిల్లాలో హై అలర్ట్ ప్రకటన

image

మొంథా తుఫాన్‌ ప్రభావంతో రేపు జిల్లాలోని 13 మండలంలో పెనుగాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కలెక్టర్ వెట్రీ సెల్వి అన్నారు. జిల్లాలోని 14 మండలాల్లో హై అలెర్ట్ ప్రకటించడం జరిగిందన్నారు. తుఫాన్ సమయంలో గాలి తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉండడంతో జిల్లాలోని 763 హోర్డింగ్స్‌ను తొలగించామన్నారు. ముంపు గ్రామాలలో 100 మంది గజ ఈతగాళ్లను సిద్ధం చేశామన్నారు.123 మంది గర్భిణీలను ఆస్పత్రికి తరలించామన్నారు.