News March 1, 2025
భూపాలపల్లి జిల్లాలో పెరిగిన ఎండ తీవ్రత

వరంగల్, BHPL జిల్లాలో ఉష్ణోగ్రతలు భగ్గుమంటున్నాయి. కొన్ని రోజుల క్రితం వరకు చలి తీవ్రత విపరీతంగా ఉండగా.. గత రెండు మూడు రోజుల నుంచి ఎండ పెరిగింది. దీంతో పొలం పనులు, ఇతర పనులకు వెళ్లే ఓరుగల్లు వాసులు భయపడుతున్నారు. ఈరోజు వరంగల్ నగరంలో 33 నుంచి 35 °C ఉష్ణోగ్రతలు ఉంటాయని, రేపు 33 నుంచి 36 °C ఉష్ణోగ్రతలతో మేఘావృతమై ఉండనున్నట్లు వాతావరణ సూచనలు చెబుతున్నాయి. మీ ప్రాంతంలో వాతావరణం ఎలా ఉందో కామెంట్ చేయండి.
Similar News
News December 3, 2025
ఈ నెల 5న మెగా పేరెంట్స్ డే: డీఈవో

జిల్లా వ్యాప్తంగా 988 ప్రభుత్వ పాఠశాలల్లో ఈ నెల 5వ తేదీన మెగా పేరెంట్స్ డే నిర్వహిస్తున్నట్లు డీఈఓ వాసుదేవరావు తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థుల అభ్యసన సామర్థ్య పరిశీలన, బోధన విధానాలు, ప్రోగ్రెస్ కార్డులు, ల్యాబ్లు, బోధన సామాగ్రి ప్రదర్శన వంటివి నిర్వహిస్తారు. విద్యార్థుల సామర్థ్యాన్ని తల్లిదండ్రుల సమక్షంలోనే పరిశీలిస్తామని, ప్రజాప్రతినిధులు కూడా పాల్గొంటారని ఆయన వెల్లడించారు.
News December 3, 2025
పిల్లల జీవితానికి ఈ అలవాట్లే పునాదులు

చిన్నతనంలోనే పిల్లలకు కొన్ని అలవాట్లు నేర్పిస్తే వారిలో ప్రశాంతతతోపాటు క్రమశిక్షణ, ఏకాగ్రత, జీవన నైపుణ్యాలు మెరుగవుతాయంటున్నారు నిపుణులు. ఉదయాన్నే త్వరగా నిద్ర లేవడం, బెడ్ సర్దడం, తమంతట తామే రెడీ కావడం, వ్యాయామం, క్లీనింగ్, గార్డెనింగ్ చేయించడం వల్ల వారిలో ఉత్పాదకత పెరుగుతుందని చెబుతున్నారు. వీటితో పాటు పుస్తకాలు చదవడం, కృతజ్ఞతాభావం అలవాటు చేయడం వారికి జీవితంలో ఎంతగానో ఉపయోగపడతాయంటున్నారు.
News December 3, 2025
నెల్లూరు: అవిశ్వాసానికి TDP “సై”..!

నెల్లూరు నగరపాలక సంస్థ మేయర్ పొట్లూరి స్రవంతిని గద్దె దించేందుకు TDP చేసిన ప్రయత్నానికి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. 54 డివిజన్లకు సంబంధించిన YCP కార్పొరేటర్లలో 42 మందిని TDP తన వైపుకు తిప్పుకుంది. దీంతో వైసీపీకి ఇంకా 12మంది మాత్రమే మిగిలారు. ఇటీవల అవిశ్వాసంపై కలెక్టర్కు నోటీసు ఇవ్వగా.. నేడు దానికి అనుమతి లభించింది. దీంతో ఈనెల 18న అవిశ్వాస తీర్మానానికి సమావేశం నిర్వహించేలా TDP కార్యాచరణ మొదలెట్టింది.


