News March 11, 2025

భూపాలపల్లి జిల్లాలో పెరుగుతున్న ఎండ తీవ్రత!

image

భూపాలపల్లి జిల్లాలో ఎండ భగ్గుమంటోంది. జిల్లాలోని రైతులు, ఉద్యోగులు, ఇతర ప్రదేశాలకు ప్రయాణించేవారు ఎండ కారణంగా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇప్పుడే వడగాలులు మొదలవుతున్నాయి. జిల్లాలో ఈరోజు 32 నుంచి 36 డిగ్రీలు, రేపు 32-37 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఉంటాయని వాతావరణ సూచికలు చెబుతున్నాయి. జిల్లాలో పలు చోట్ల ఇప్పటికే చెక్ డ్యామ్‌లు, బోరుబావులు ఎండిపోయాయి.

Similar News

News January 9, 2026

మెక్సికో డ్రగ్స్ ముఠాలపై నేరుగా దాడి చేస్తాం: ట్రంప్

image

మెక్సికో నుంచి అమెరికాలోకి పెద్ద ఎత్తున డ్రగ్స్ వస్తున్నాయని ట్రంప్ అన్నారు. దీని వల్ల ఏటా వేలాది మంది అమెరికన్ పౌరులు మరణిస్తున్నారని తెలిపారు. పరిస్థితి చాలా అధ్వానంగా తయారైందన్నారు. మెక్సికోను పూర్తిగా డ్రగ్స్ ముఠాలు నడుపుతున్నాయని ఆరోపించారు. దీన్ని అడ్డుకునేందుకు వారిపై నేరుగా దాడులు చేస్తామని ట్రంప్ హెచ్చరించారు. సరిహద్దుల్లో చొరబాట్లు లేకుండా పటిష్ఠ చర్యలు తీసుకుంటామన్నారు.

News January 9, 2026

రిఫండ్ రాలేదా? కారణమిదే అయ్యుండొచ్చు..

image

సాధారణంగా డిసెంబర్ నాటికే IT రిఫండ్ రావాలి. కానీ, ఈసారి టెక్నికల్ ఇష్యూస్ వల్ల లేటవుతోంది. బ్యాంక్ అకౌంట్ వెరిఫై చేయకపోవడం, తప్పుడు మినహాయింపులు కోరడం లేదా ఇ-వెరిఫికేషన్ పూర్తి చేయకపోవడం వంటివి కారణాలు కావొచ్చు. అలాగే ఫారంలో వివరాలు సరిపోలకపోయినా IT శాఖ నోటీసులు పంపిస్తుంది. నోటీసు రాకపోతే టెన్షన్ పడక్కర్లేదు. ఇంటర్నల్ చెకింగ్ పూర్తి కాగానే అకౌంట్లో డబ్బులు జమవుతాయి.

News January 9, 2026

NLG: ఛైర్మన్ రాజీనామా.. తెరపడిన మదర్ డెయిరీ వివాదం!

image

మదర్ డెయిరీలో రాజుకున్న వివాదానికి ఎట్టకేలకు తెరపడింది. ఛైర్మన్ గుడిపాటి మధుసూదన్ రెడ్డి రాజీనామా చేయడంతో డైరెక్టర్లు సంబరాలు చేసుకున్నారు. ఇటీవల ఛైర్మన్‌కు వ్యతిరేకంగా 11 మంది అధికార, ప్రతిపక్ష డైరెక్టర్లు ఎండీకి నోటీసులు అందజేసి ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలని కోరిన విషయం తెలిసిందే. ఛైర్మన్ రాజీనామా చేయాల్సిందే అంటూ డైరెక్టర్లు పట్టుపట్టడంతో ఎట్టకేలకు తన రాజీనామా లేఖను ఎండీకి అందజేశారు.