News March 11, 2025

భూపాలపల్లి జిల్లాలో పెరుగుతున్న ఎండ తీవ్రత!

image

భూపాలపల్లి జిల్లాలో ఎండ భగ్గుమంటోంది. జిల్లాలోని రైతులు, ఉద్యోగులు, ఇతర ప్రదేశాలకు ప్రయాణించేవారు ఎండ కారణంగా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇప్పుడే వడగాలులు మొదలవుతున్నాయి. జిల్లాలో ఈరోజు 32 నుంచి 36 డిగ్రీలు, రేపు 32-37 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఉంటాయని వాతావరణ సూచికలు చెబుతున్నాయి. జిల్లాలో పలు చోట్ల ఇప్పటికే చెక్ డ్యామ్‌లు, బోరుబావులు ఎండిపోయాయి.

Similar News

News February 12, 2026

కౌంటింగ్‌ కేంద్రాల వద్ద నిషేధాజ్ఞలు: సీపీ సన్‌ప్రీత్ సింగ్‌

image

మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు నేపథ్యంలో జనగామ, స్టే.ఘ, వర్ధన్నపేట, పరకాల, నర్సంపేట కౌంటింగ్ కేంద్రాల వద్ద భద్రత ఏర్పాటు చేసినట్లు CP సన్‌ప్రీత్ సింగ్ తెలిపారు. కౌంటింగ్ కేంద్రాలకు 200 మీటర్ల పరిధిలో బీఎన్‌ఎస్ 163 ప్రకారం నిషేధాజ్ఞలు విధిస్తున్నట్లు ప్రకటించారు. శుక్రవారం ఉదయం 6 గంటల నుంచి ఎల్లుండి ఉదయం 6 గంటల వరకు ఇవి అమలులో ఉంటాయని, ఐదుగురు అంతకంటే ఎక్కువ మంది గుమిగూడటం నేరమని హెచ్చరించారు.

News February 12, 2026

సంగారెడ్డి: 18, 25 తేదీల్లో సదరం శిబిరం

image

సంగారెడ్డి జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో ఈనెల 18, 25 తేదీల్లో దివ్యాంగులకు యుడీఐడీ సదరం శిబిరం నిర్వహిస్తున్నట్లు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మురళీకృష్ణ గురువారం తెలిపారు. కొత్తగా దరఖాస్తు కోసం నిరంతరం స్లాట్ బుకింగ్ చేసుకునే అవకాశం ఉందని చెప్పారు. శిబిరానికి వచ్చేవారు స్లాట్ పేపర్, ఆధార్ కార్డు, పాస్ పోర్టు జిరాక్స్, మెడికల్ సర్టిఫికేట్‌లతో హాజరు కావాలని కోరారు.

News February 12, 2026

అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి: కలెక్టర్

image

డీఎంఎఫ్ నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ వినోద్ కుమార్ ఆదేశించారు. గురువారం బాపట్ల కలెక్టరేట్లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రూ.54.80 కోట్ల నిధుల్లో 42 పనులకు ఆమోదం లభించగా, 11 పనులు రూ.6.62 కోట్లతో పూర్తయ్యాయన్నారు. మిగిలినవి పురోగతిలో ఉన్నాయని తెలిపారు. తాగునీటి చెరువులు, రహదారులు, బ్రిడ్జి పనులు త్వరగా పూర్తి చేయాలని సూచించారు.