News February 14, 2025
భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడిగా ఎడ్ల సంతోష్

భూపాలపల్లి జిల్లాలో శుక్రవారం తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్ యూనియన్(ఎన్.యూ.జే.ఐ) నూతన జిల్లా కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ పావుశెట్టి శ్రీనివాస్ తెలిపారు. జిల్లా అధ్యక్షుడిగా ఎడ్ల సంతోష్, జిల్లా ప్రధాన కార్యదర్శిగా దొమ్మటి రవీందర్, జిల్లా ఉపాధ్యక్షుడిగా బండారి రాజు, గట్టు రవీందర్, అరిగేలా జనార్దన్, పూర్తి కమిటీని ఎన్నుకున్నారు.
Similar News
News March 28, 2025
ఉమ్మడి అనంత జిల్లాలో ఐదుగురికి నామినేటెడ్ పదవులు

ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఐదుగురికి కూటమి ప్రభుత్వం నామినేటెడ్ పదవులను కేటాయించింది. హిందూపురం మార్కెట్ యార్డ్ కమిటీ ఛైర్మన్‌గా అశ్వర్థ నారాయణరెడ్డి, కళ్యాణదుర్గం మార్కెట్ యార్డు ఛైర్ పర్సన్‌గా లక్ష్మీదేవి, మడకశిర మార్కెట్ యార్డు ఛైర్మన్‌గా గురుమూర్తి, గుంతకల్లు మార్కెట్ యార్డు ఛైర్ పర్సన్‌గా లక్ష్మీదేవికి అవకాశం లభించింది. ధర్మవరం మార్కెట్ యార్డు ఛైర్మన్‌గా నాగరత్నమ్మ (బీజేపీ)ను నియమించారు.
News March 28, 2025
ఎన్టీఆర్: రైలు ప్రయాణికులకు శుభవార్త

విజయవాడ మీదుగా హైదరాబాద్(HYB)-కటక్(CTC) మధ్య నడుస్తున్న ప్రత్యేక రైళ్లను పొడిగించామని రైల్వే అధికారులు తెలిపారు. నం.07165 HYB-CTC రైలును ఏప్రిల్ 1 నుంచి జూన్ 24 వరకు ప్రతి మంగళవారం, నం.07166 CTC-HYB మధ్య నడిచే రైలును ఏప్రిల్ 2 నుంచి జూన్ 25 వరకు ప్రతి బుధవారం నడిచేలా పొడిగించామన్నారు. ఈ రైళ్లు ఏపీలో విజయవాడతో పాటు అనకాపల్లి, రాజమండ్రి, విజయనగరం తదితర స్టేషన్‌లలో ఆగుతాయన్నారు.
News March 28, 2025
మతం విషయంలో నా తల్లిదండ్రులకు సమస్య రాలేదు: సల్మాన్ ఖాన్

తన తల్లిదండ్రుల వివాహంలో హిందూ-ముస్లిం అనే తేడా ఎప్పుడూ రాలేదని సల్మాన్ ఖాన్ అన్నారు. వారికి వృత్తిపరమైన సమస్య తప్ప వేరే ఏది ఉండేది కాదని పేర్కొన్నారు. సికందర్ చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా ఈ విషయాల్ని మీడియాతో పంచుకున్నారు. సల్మాన్ ఖాన్ తల్లిదండ్రులు సలీమ్, సుశీల 1964లో ప్రేమ వివాహం చేసుకున్నారు. అనంతరం సల్మా ఖాన్‌గా సుశీల పేరు మార్చుకున్నారు.