News January 29, 2025
భూపాలపల్లి జిల్లా కలెక్టర్ ఆదేశాలు

భూపాలపల్లి జిల్లా కేంద్రంలో నిర్మాణంలో ఉన్న నూతన గ్రంథాలయ భవనాన్ని బుధవారం జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ.. పెండింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. గ్రంథాలయ భవనానికి అవసరమైన విద్యుత్ కనెక్షన్ కోసం సింగరేణి అధికారులతో చర్చించి త్వరలోనే అందుబాటులోకి తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.
Similar News
News February 16, 2025
మెదక్: తమ్ముడిని కొట్టి చంపి.. ఆపై!

తమ్ముడిని హత్య చేసిన అన్నను పోలీసులు రిమాండ్‌కు తరలించారు. వివరాలు.. మునిపల్లి మండలం చీలపల్లి చెందిన శివయ్యను శుక్రవారం సాయంత్రం తన అన్న యాదయ్య హత్య చేసి పరారయ్యాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. శనివారం యాదయ్య పోలీసులను చూసి పారిపోతుండగా పట్టుకున్నారు. విచారణలో శివయ్యను బండరాయితో కొట్టి చంపినట్లు ఒప్పుకున్నాడని, హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉందని తెలిపారు.
News February 16, 2025
CRASH ప్రోగ్రాంలో తాగునీటి బోర్లకు రిపేర్స్: RWS EE

అల్లూరి జిల్లాలోని 22 మండలాల్లోని మంచినీటి బోర్లకు యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేయిస్తున్నట్లు గ్రామీణ నీటి సరఫరా శాఖ ఈఈ జవహర్ కుమార్ తెలిపారు. జిల్లాలో మొత్తం 9,639 చేతి పంపులు ఉన్నాయన్నారు. వీటికి 45 రోజుల క్రాష్ ప్రోగ్రాంలో march 15వ తేదికి రిపేర్లు పూర్తి చేసి, గ్రామీణ ప్రాంతంలో పరిశుభ్రమైన నీటిని అందించాలన్నదే తమ లక్ష్యమని వెల్లడించారు.
News February 16, 2025
MPTC, ZPTC ఎన్నికలు: హనుమకొండ జిల్లా UPDATES

హనుమకొండ జిల్లా ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు-2025కు సంబంధించిన పోలింగ్ కేంద్రాల జాబితాను అధికారులు విడుదల చేశారు. జిల్లాలో 12 ZPTC స్థానాలు ఉన్నాయి. 631 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. మొత్తం 129 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు స్పష్టం చేశారు. హన్మకొండ జిల్లాలో మొత్తం 3,72,646 మంది ఓటర్లు ఉన్నారు.