News May 11, 2024
భూపాలపల్లి: టిప్పర్ ఢీ కొని ఇద్దరు మృతి

భూపాలపల్లిలోని మంజునగర్‌లోని ఏరియా హస్పిటల్ దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. మంజునగర్ బస్టాండ్‌లో నిల్చున్న ప్రయాణికులను టిప్పర్ ఢీ కొంది. ఈ ఘటనలో ఇద్దరు మృతిచెందగా మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. మృతులు ఆంధ్రప్రదేశ్ వాసులుగా గుర్తించారు. ఓటువేసేందుకు స్వగ్రామానికి వెళ్లేందుకు బస్టాండ్‌లో నిల్చుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
Similar News
News February 7, 2025
నెక్కొండ: ఆ గ్రామాల్లో పంచాయతీ ఎన్నికలేనా..?

వరంగల్ జిల్లా నెక్కొండ మండలంలోని ఆ గ్రామాల్లో విచిత్ర పరిస్థితి నెలకొంది. రాబోయేది పంచాయతీ ఎన్నికలా..? లేక మున్సిపల్ ఎన్నికలో తెలియక ప్రజలు ఎదురు చూస్తున్నారు. నెక్కొండను మున్సిపాలిటీగా చేసేందుకు గతంలోనే నోటిఫికేషన్ విడుదల చేశారు. నెక్కొండతో పాటు నెక్కొండ తండా, టీకే తండా, గుండ్రపల్లి, అమీన్‌పేటల్లో గ్రామ సభలను సైతం నిర్వహించారు. కానీ ఇంత వరకు స్పష్టత లేకపోవడంతో ప్రజలు, అధికారులు అయోమయంలో పడ్డారు.
News February 7, 2025
ఎస్టీపీ ఏర్పాటుకు అనువైన స్థలాలను గుర్తించాలి: కలెక్టర్

ఎస్టీపీ ఏర్పాటుకు అనువైన స్థలాలను గుర్తించాలని వరంగల్ & హనుమకొండ కలెక్టర్లు సత్య శారద, ప్రావీణ్య అన్నారు. కుడా కార్యాలయంలోని సమావేశ మందిరంలో బల్దియా ఆధ్వర్యంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ మురుగు నీటి నిర్వహణ వ్యవస్థ ఎస్టీపీల ఏర్పాటు కోసం స్థలాలు గుర్తింపుపై అధికారులతో సమన్వయ సమావేశం ఏర్పాటు చేశారు. 2055 సంవత్సరానికి గాను 21.31 లక్షల జనాభాకు అవసరమయ్యే డ్రైనేజ్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌లో వివరించారు.
News February 6, 2025
చెత్తను వేరుగా అందించడంపై అవగాహన కల్పించాలి: బల్దియా కమిషనర్

తడి పొడి చెత్తను వేరుగా అందించడంపై ప్రజల్లో అవగాహన కల్పించాలని బల్దియా కమిషనర్ అశ్విని తానాజీ వాకడే అభిప్రాయపడ్డారు. మున్సిపల్ గెస్ట్ హౌస్‌లో నిర్వహిస్తున్న సిగ్రిగేషన్ కంపోస్ట్ యూనిట్లను కమిషనర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. నగర వ్యాప్తంగా సమగ్ర శానిటేషన్ విధానాలను అవలంభించడానికి ప్రయోగాత్మకంగా 6, 49వ డివిజన్లను ఎంపిక చేసి, కంపోస్టు యూనిట్లు చేర్చడం ద్వారా ఎరువుగా మార్చడం చేయాలన్నారు.