News January 31, 2025

భూపాలపల్లి: డ్రైవర్లకు కళ్లద్దాలు పంపిణీ చేసిన కలెక్టర్, ఎస్పీ

image

భూపాలపల్లి జిల్లా పట్టణ కేంద్రంలోని డా.బీఆర్ అంబేడ్కర్ సెంటర్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ కిరణ్ ఖరే పాల్గొని పలువురు డ్రైవర్లకు ఉచితంగా కళ్లద్దాలు పంపిణీ చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ.. వాహనదారులు హెల్మెట్ ధరించడం వల్ల రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు ప్రాణాలను కాపాడుకోవడానికి అవకాశం ఉందని తెలిపారు. వాహనదారులు కుటుంబ సభ్యులను గుర్తు చేసుకుని వాహనం నడపాలని కోరారు. 

Similar News

News December 1, 2025

నెల్లూరు: అసంతృప్తిలో కూటమి నాయకులు..!

image

నెల్లూరు జిల్లాలోని కూటమి నాయకుల్లో అసంతృప్తి చెలరేగుతోంది. అధికారంలోకి వచ్చేందుకు కష్టపడి పనిచేసిన తమను మంత్రులు, ఎమ్మెల్యేలు పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. ప్రతి పనికి మంత్రులు, MLAలే కాంట్రాక్టర్లుగా మారుతున్నారని వాపోయారు. తమకంటూ ఏ పనులు ఇవ్వడం లేదని వాపోతున్నారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లోనూ ఇలాగే ఉందని చెబుతున్నారు. ఈ ప్రభావం స్థానిక ఎన్నికలపై ఉంటుందని విశ్లేషకులు చెబుతున్నారు.

News December 1, 2025

‘ఆర్‌జీ-3 ఏరియాలో నవంబర్‌లో 72% బొగ్గు ఉత్పత్తి’

image

RG-3 ఏరియాలో NOV నెల బొగ్గు ఉత్పత్తి, రవాణా వివరాలు GM నరేంద్ర సుధాకరరావు వెల్లడించారు. 5.70 లక్షల టన్నుల లక్ష్యానికి 4.09 లక్షల టన్నులు (72%) ఉత్పత్తిచేశారు. ఓబీ వెలికితీతలో షవెల్స్ విభాగం 12.50 లక్షల క్యూబిక్ మీటర్ల లక్ష్యానికి 13.11 లక్షల క్యూబిక్ మీటర్లు (105%) సాధించింది. బొగ్గు రవాణా 5.18 లక్షల టన్నులు నమోదైంది. OCP-1 38%, OCP-2 116% ఉత్పత్తి సాధించాయి. లక్ష్య సాధనకు భద్రతతో పని చేయాలన్నారు.

News December 1, 2025

సిద్దిపేట: AIDS గురించి పిల్లలకు తెలియజేయాలి: జడ్జి

image

HIV/AIDS గురించి తల్లి దండ్రులు పిల్లలకు తెలియజేయాలని సిద్దిపేట జిల్లా లీగల్ సెల్ అథారిటీ సెక్రటరీ, జడ్జి సంతోష్ కుమార్ సూచించారు. ఎయిడ్స్ ప్రివెన్షన్ డే సందర్భంగా సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో లీగల్ అవేర్నెస్ ప్రోగ్రాం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. గతంలో ఈ వ్యాధి గురించి ఎవరికి తెలిసేది కాదన్నారు. ఎయిడ్స్ పై ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలాన్నారు.