News April 1, 2025
భూపాలపల్లి : నిరుద్యోగ యువత ఆందోళన.. !

భూపాలపల్లి జిల్లాలో రాజీవ్ యువ వికాస్ పథకం కోసం దరఖాస్తు చేసిన నిరుద్యోగ యువత ఆందోళనలో ఉన్నారు. ఈ పథకం ప్రయోజనాలు గ్రామీణ కార్యకర్తలకు చేరకుండా, అర్హత కలిగిన నిరుద్యోగులకు అధికారుల ద్వారా అందాలని వారు డిమాండ్ చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ పథకం నిరుద్యోగ యువతకు అందించే గొప్ప అవకాశమని వారు అభిప్రాయపడ్డారు.
Similar News
News December 10, 2025
మెహుల్ చోక్సీ పిటిషన్ కొట్టేసిన బెల్జియం సుప్రీంకోర్టు

PNBను రూ.13వేల కోట్లు మోసం చేసిన ఆర్థిక నేరస్థుడు మెహుల్ చోక్సీ అప్పగింతకు ఆఖరి అడ్డంకి తొలగిపోయింది. ఆయనను INDకు అప్పగించాలని కింది కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ బెల్జియం SCలో చోక్సీ పిటిషన్ దాఖలు చేశారు. విచారణ జరిపిన SC కింది కోర్టు తీర్పును సమర్థిస్తూ పిటిషన్ను కొట్టేసింది. దీంతో చోక్సీని భారత్కు అప్పగించే ప్రక్రియ మొదలయిందని బెల్జియం అధికారులు తెలిపారు. అతను 2018 JANలో పారిపోయారు.
News December 10, 2025
మీ ఇంట్లో ఇవి ఉంటే లక్ష్మీదేవి రాదు: పండితులు

శుభ్రంగా ఉండే ఇంట్లోకే లక్ష్మీదేవి వస్తుందని పండితులు, వాస్తు నిపుణులు చెబుతున్నారు. పగిలిన కప్పులు/ప్లేట్లు, పాత వార్తాపత్రికలు, కాలం చెల్లిన ఆహారం/మందులు, వాడని దుస్తులు, చనిపోయిన మొక్కలు, పనిచేయని ఎలక్ట్రానిక్స్, ప్రతికూల జ్ఞాపకాలు ఉన్న వస్తువులను వెంటనే తొలగించడం ద్వారా ఇంట్లోకి సానుకూల శక్తి వస్తుందని అంటున్నారు. తద్వారా మానసిక ఆందోళన దూరమై ఇంట్లో శ్రేయస్సు, సంపద లభిస్తుందని అంటున్నారు.
News December 10, 2025
సౌతాఫ్రికా చెత్త రికార్డ్

నిన్న భారత్తో జరిగిన తొలి T20లో ఓటమితో SA జట్టు చెత్త రికార్డ్ మూటగట్టుకుంది. ఆరుసార్లు 100 పరుగుల లోపు ఆలౌట్ అయిన జట్టుగా నిలిచింది. ఇందులో మూడుసార్లు భారత్ ప్రత్యర్థి కావడం గమనార్హం. 2022లో 87 రన్స్, 2023లో 95 పరుగులకే SA ఆలౌటైంది. నిన్నటి మ్యాచ్లో 74 రన్స్కే ప్రొటీస్ బ్యాటర్లు చాప చుట్టేశారు. అలాగే IND చేతిలో అతి ఎక్కువసార్లు తక్కువ పరుగులకే ఆలౌట్ అయిన జట్ల జాబితాలో SA 4వస్థానంలో ఉంది.


