News March 28, 2025
భూపాలపల్లి: నెట్‌వర్క్ లేక యువత ఆగ్రహం

భూపాలపల్లి జిల్లాలో రాజీవ్ యువ వికాసం దరఖాస్తు దారులకు నెట్ వర్క్ సమస్యలు తప్పడం లేదు. జిల్లాలోని పలు తహశీల్దార్ కార్యాలయాల్లో సైట్ పని చేయకపోవడంతో కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాల కోసం ఎదురుచూస్తున్న యువకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఏప్రిల్ 5 దరఖాస్తు చివరి తేదీ కావడంతో.. తహశీల్దార్ కార్యాలయాల చుట్టు తిరగాల్సి వస్తోందని, వెంటనే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని దరఖాస్తుదారులు కోరుతున్నారు.
Similar News
News November 22, 2025
అప్పుగా తెచ్చిన ₹2.30L కోట్లు ఏమయ్యాయ్: KTR

TG: అప్పులపై తప్పుడు ప్రచారం చేస్తున్న CM క్షమాపణలు చెప్పాలని KTR డిమాండ్ చేశారు. నెలకు ₹2300 CR కూడా లేని వడ్డీని ₹7వేల కోట్లుగా అబద్ధాలు చెబుతున్నట్లు ‘కాగ్’ నివేదిక బట్టబయలు చేసిందని చెప్పారు. BRS పదేళ్లలో ₹2.8L కోట్ల రుణం తెస్తే కాంగ్రెస్ 23నెలల్లోనే ₹2.30L కోట్లు అప్పు చేసిందని దుయ్యబట్టారు. కొత్త ప్రాజెక్టులు నిర్మించలేదని, అప్పు తెచ్చిన రూ.లక్షల కోట్లు ఏమయ్యాయో చెప్పాలని డిమాండ్ చేశారు.
News November 22, 2025
నాగర్‌కర్నూల్ ఎస్పీగా సంగ్రామ్ సింగ్ పాటిల్ బాధ్యతలు

నాగర్‌కర్నూల్ జిల్లా నూతన ఎస్పీగా సంగ్రామ్ సింగ్ పాటిల్ శనివారం ఎస్పీ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేస్తానని తెలిపారు. ప్రజలు చట్టబద్ధంగా తమ సమస్యలు పరిష్కరించుకోవాలని సూచించారు. ప్రజలకు పోలీసులు నిరంతరం అందుబాటులో ఉండాలని సిబ్బందిని ఆదేశించారు.
News November 22, 2025
NMMS-2025 పరీక్షకు ఏర్పాట్లు పూర్తి: డీఈవో

జిల్లాలో రేపు జరగనున్న NMMS-2025 స్కాలర్‌షిప్ పరీక్షకు 1474 మంది 8వ తరగతి విద్యార్థులు హాజరుకానున్నారని జిల్లా విద్యాధికారి కె.రాము తెలిపారు. ఉదయం 9 గంటలకు ప్రారంభమయ్యే పరీక్షకు విద్యార్థులు నిర్ణీత సమయంలోగా పరీక్ష కేంద్రాలకు చేరాలని సూచించారు. జగిత్యాలలో 3, కోరుట్లలో 2, మెట్‌పల్లిలో 1 పరీక్షా కేంద్రం ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు.


