News March 16, 2025
భూపాలపల్లి: నెల గడుస్తున్నా దొరకని పెద్దపులి ఆచూకీ!

భూపాలపల్లి జిల్లాలో గత నెల రోజులుగా పెద్దపులి సంచారం కలకలం రేపుతున్న విషయం తెలిసిందే. జిల్లాలోని అటవి గ్రామాలైన కమలాపూర్, రాంపూర్ గ్రామ పరిధిలోని అడవుల్లో పులి తిరుగుతున్నట్లు అటవిశాఖ అధికారులు చెబుతున్నప్పటికీ.. పులి ఆచూకీ మాత్రం లభించట్లేదు. దీంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు భయాందోళనలకు గురవుతూ వ్యవసాయ పనులు చేసుకోలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. త్వరగా పులిని పట్టుకోవాలని కోరుతున్నారు.
Similar News
News November 21, 2025
వరంగల్: ప్రభుత్వ ఉద్యోగులపై దాడి చేస్తే కఠిన చర్యలు

విధి నిర్వహణలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు, ఆర్టీసీ సిబ్బంది, వైద్యులు, రెవెన్యూ, పోలీస్ అధికారులను బెదిరించడం, దాడి చేయడం వంటి చర్యలపై వరంగల్ పోలీసు శాఖ తీవ్ర హెచ్చరిక జారీ చేసింది. ప్రజా సేవల్లో ఉన్న అధికారుల పనిలో జోక్యం చేసుకున్న వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తప్పవని వరంగల్ పోలీసులు తమ అధికారిక ఫేస్బుక్ అకౌంట్ ద్వారా స్పష్టం చేశారు.
News November 21, 2025
ఫార్ములా ఈ కేసులో చట్టపరంగానే చర్యలు: మంత్రి కోమటిరెడ్డి

నల్గొండ: ఫార్ములా ఈ కారు రేస్ కేసులో చట్టపరంగానే చర్యలు ఉంటాయని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ఈ కేసులో మాజీ మంత్రి కేటీఆర్పై విచారణకు గవర్నర్ అనుమతి ఇవ్వడంపై ఆయన నల్గొండలో స్పందించారు. తమ ప్రభుత్వం ఎలాంటి కక్ష సాధింపు చర్యలకు పాల్పడదని, చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందని స్పష్టం చేశారు.
News November 21, 2025
NZB: గోల్డ్ మెడల్ సాధించడం రాష్ట్రానికి గర్వకారణం: TPCC చీఫ్

గ్రేటర్ నోయిడాలో జరిగిన వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ కప్-2025లో NZBకు చెందిన నికత్ జరీన్ గోల్డ్ మెడల్ సాధించడం రాష్ట్రానికి గర్వకారణమని TPCC చీఫ్, MLC మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. తెలంగాణ క్రీడా గౌరవాన్ని మరోసారి ప్రపంచ వేదికపై ప్రతిష్టాత్మకంగా నిలబెట్టారని ప్రశంసించారు. భవిష్యత్తులో మరెన్నో అంతర్జాతీయ పోటీల్లో పతకాలు సాధించి దేశ, రాష్ట్ర ప్రతిష్టను మరింత ఎత్తుకు తీసుకెళ్లాలని ఆకాంక్షించారు.


