News February 26, 2026
భూపాలపల్లి: నేటి నుండి ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలు

భూపాలపల్లి జిల్లాలో నేటి నుంచి ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు ప్రారంభం కానున్నట్లు నోడల్ అధికారి వెంకన్న తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. జిల్లాలోని 8 కేంద్రాల్లో మొత్తం 1,936 మంది విద్యార్థులు (1,586 జనరల్, 350 ఒకేషనల్) హాజరవుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. విద్యార్థులు సకాలంలో కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు.
Similar News
News April 18, 2026
గజ్వేల్: భూసార పరీక్షా కేంద్రం అందుబాటులోకి వచ్చేనా..?

గజ్వేల్ పట్టణంలో భూసార పరీక్షా కేంద్రాన్ని 2023 అక్టోబరులో గత ప్రభుత్వంలో హరీశ్ రావు చేతుల మీదుగా ప్రారంభించారు. అయితే దీనికి ఇప్పటికీ సిబ్బంది నియామకం, ల్యాబ్ పరికరాలు లేకపోవడంతో నిరుపయోగంగా మారింది. వానాకాలం సీజన్ ప్రారంభమవుతున్న తరుణంలో, ఇప్పటికైనా అధికారులు స్పందించి ఈ కేంద్రాన్ని అందుబాటులోకి తీసుకురావాలని, తమ భూములను పరీక్షించుకునే వెసులుబాటు కల్పించాలని స్థానిక రైతులు కోరుతున్నారు.
News April 18, 2026
కాళేశ్వరం బ్యారేజ్‌ల పరిశీలనకు 43 రోజుల గడువు

కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజ్‌ల వైఫల్య కారణాల విశ్లేషణకు రాష్ట్ర ప్రభుత్వం 43 రోజుల గడువు నిర్ణయించింది. కల్నల్ పరీక్షిత్ మెహ్రా నేతృత్వంలో 9 మంది సభ్యులతో స్టీరింగ్ కమిటీ ఏర్పాటు చేసింది. మే 30లోగా పరీక్షలు పూర్తి చేసి పునరుద్ధరణ డిజైన్లు సిద్ధం చేయాలని ఆదేశించింది. పనుల పురోగతిపై ప్రతిరోజూ నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.
News April 18, 2026
GNT: పెరుగుతున్న కులాంతర వివాహాలు

సమాజంలో కులాల అడ్డు గోడలు కూలుతున్నాయి. యువత ఆలోచనల్లో విశేష మార్పు వస్తోంది. ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఏటా 600కు పైగా కులాంతర పెళ్లిళ్లు జరుగుతున్నాయి. నగరాల్లో ఈ సంఖ్య పెరుగుతుండగా, పల్లెల్లో ఇంకా భయం నెలకొంది. ఈ పెళ్లిళ్లలో ఎస్సీ, ఎస్టీ, బీసీ యువత ముందున్నారు. వేర్వేరు కులాల మధ్య వివాహాలతో జన్యు వైవిధ్యం పెరిగి భావితరాలు ఆరోగ్యంగా ఉంటాయని సైన్స్ చెబుతోంది.


