News March 5, 2025
భూపాలపల్లి: నేడే పరీక్షలు.. ALL THE BEST

భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా 3,615 మంది విద్యార్థులు నేడు ఇంటర్ పరీక్ష రాయనున్నారు. ఫస్టియర్ 1,820, సెకండియర్లో 1,795 మంది విద్యార్థులు రాయనుండగా.. 8 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్షల నేపథ్యంలో ట్రాఫిక్ పోలీసులు అప్రమత్తంగా ఉండాలని, బీఎన్ఎన్ఎస్ 163(144) చట్టం అమలులో ఉంటుందని పోలీసులు తెలిపారు. కాగా, పరీక్షకు 30 నిమిషాలకు ముందే పరీక్ష కేంద్రానికి చేరుకోండి.
ALL THE BEST
Similar News
News November 16, 2025
DIHARలో 21 పోస్టులు

DRDO అనుబంధ సంస్థ డిఫెన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హై ఆల్టిట్యూడ్ రీసెర్చ్(DIHAR) 21 JRF,రీసెర్చ్ అసోసియేట్ పోస్టులను భర్తీ చేయనుంది. పోస్టును బట్టి ఎంటెక్, బీటెక్, BE, MSc, M.VSc, PhD ఉత్తీర్ణతతో పాటు NET/GATE అర్హత గలవారు డిసెంబర్ 5న ఇంటర్వ్యూకు హాజరుకావొచ్చు. వయసు 28 నుంచి 35ఏళ్ల మధ్య ఉండాలి. JRFకు నెలకు రూ.37వేలు+HRA, RAకు రూ.67వేలు+HRA చెల్లిస్తారు.
News November 16, 2025
ఇతిహాసాలు క్విజ్ – 68

ఈరోజు ప్రశ్న: మహాభారతం ప్రకారం.. మూడే మూడు బాణాలతో కురుక్షేత్రాన్ని ముగించగల సత్తా ఉన్న యోధుడు ఎవరు? ఆయన యుద్ధంలో పాల్గొనకపోవడానికి గల కారణాలేంటి?
☛ పై ప్రశ్నకు సమాధానాన్ని సాయంత్రం ఆరు గంటలకు పబ్లిష్ చేస్తాం.
☛ మీకు జవాబు తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి.
<<-se>>#Ithihasaluquiz<<>>
News November 16, 2025
మర్రిపాడు: హైవేపై ఘోర ప్రమాదం.. 10మందికి గాయాలు

మర్రిపాడు మండలం నందవరం కూడలి వద్ద జాతీయ రహదారిపై ఆదివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జామాయిల్ నాటే కూలీలు వస్తున్న ఆటోను సిమెంట్ ట్యాంకర్ లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో 10 మందికి గాయాలు కాగా, మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన క్షతగాత్రులను 108 వాహనం ద్వారా ఆత్మకూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. సమాచారం అందుకున్న సీఐ, ఎస్సైలు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు.


