News March 18, 2025
భూపాలపల్లి: ‘పది’ పరీక్ష పదిలంగా!

ఈ నెల 21 నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. కాగా పరీక్షలు దగ్గర పడటంతో కొంతమంది విద్యార్థులు గాబరా పడి సమాధానం తెలిసినా సరిగా రాయలేకపోతుంటారు. వారంతా ఒత్తిడికి లోనుకాకుండా నేను బాగా చదివాను.. బాగా రాస్తాను అని కాన్ఫిడెంట్‌గా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. వీరంతా సెల్‌ఫోన్, టీవీకి దూరంగా ఉన్నట్లయితే మంచి మార్కులు వచ్చే అవకాశం ఉంది. జిల్లాలో 3,449 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు.
Similar News
News July 11, 2025
HYD: కల్తీ కల్లు తాగి ఎనిమిది మంది మృతి

కల్తీ కల్లు <<17017648>>రాజేసిన అగ్గి<<>> ఇంకా చల్లారడంలేదు. ఈ ప్రమాదపు కల్లు తాగి అస్వస్థతకు గురై చికిత్స పొందుతూ పెద్ద గంగారాం (70) అర్ధరాత్రి 1:30కు గాంధీ హాస్పిటల్‌లో మృతి చెందాడు. కూకట్‌పల్లి PS పరిధిలోని ఆదర్శనగర్‌లో ఆయన నివాసం ఉండేవారు. ఈయన మరణంతో మృతుల సంఖ్య ఎనిమిదికి చేరింది. 30 మందికి పైగా వేర్వేరు ఆస్పత్రుల్లో చికిత్స పొంతుతున్నారు.
News July 11, 2025
KNR: 24 గంటల్లో దొంగలను అరెస్టు చేసిన పోలీసులు

కరీంనగర్ మారుతి నగర్‌లో నిద్రిస్తున్న మహిళ మెడలో నుంచి బంగారు పుస్తెలతాడు ఎత్తుకెళ్లిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఇద్దరు నిందితులు నాగరాజు, సదాశివను అరెస్టు చేసినట్లు మూడవ పట్టణ సీఐ జాన్ రెడ్డి తెలిపారు. నిందితులు బంగారు గొలుసు అమ్మేందుకు వెళ్తుండగా చాకచక్యంగా అరెస్టు చేసి, నిందితుల వద్ద బంగారు గొలుసు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు.
News July 11, 2025
జిల్లాలో స్వచ్ఛ సర్వేక్షణ కేంద్రం బృందాలు పర్యటన: కలెక్టర్

స్వచ్ఛ సర్వేక్షణలో భాగంగా జిల్లాలో ఉత్తమ గ్రామాలు ఎంపికలో భాగంగా కేంద్రం నుంచి అకాడమీ ఆఫ్ మేనేజ్‌మెంట్ స్టడీస్ (AMS )బృందాలు జిల్లాలో పర్యటించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి తెలిపారు. గురువారం సాయంత్రం జిల్లా అధికారులతో కేంద్ర ఏఎంఎస్ బృంద సభ్యులు ఏలూరులో కలెక్టర్‌ను కలిశారు. రోజుకు 2 గ్రామాల చొప్పున 36 గ్రామాలలో పర్యటిస్తారని తెలిపారు.