News April 17, 2025
భూపాలపల్లి: పోటాపోటీగా ప్రజల మధ్య పర్యటనలు

భూపాలపల్లి నియోజకవర్గంలో ప్రధాన పార్టీల నాయకులు పోటాపోటీగా ప్రజల మధ్య పర్యటిస్తున్నారు. MLA గండ్ర సత్యనారాయణ రావు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో ప్రజలను కలుస్తున్నారు. అలాగే మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి కార్యకర్తలను సమాయత్తం చేస్తూ పరామర్శలు, శుభకార్యాల్లో చురుకుగా పాల్గొంటున్నారు. ఇక బీజేపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి కీర్తి రెడ్డి నియోజకవర్గంలో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు.
Similar News
News April 20, 2025
సఖినేటిపల్లి: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

సఖినేటిపల్లి మండలం అంతర్వేది దేవస్థానం రోడ్డులో రాంబాగ్ దాటిన తరువాత IPC చర్చి వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందాడు. బైక్‌పై వెళ్తున్న నిమ్మకాయల వ్యాపారి బొనం బాపిరాజు (35) కారు ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడని స్థానికులు తెలిపారు. మృతుడు మామిడికుదురు మండలం పాసర్లపూడి గ్రామానికి చెందిన వ్యక్తిగా చెబుతున్నారు. మృతుడికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News April 20, 2025
జేఈఈలో 299వ ర్యాంక్ సాధించిన సిద్దిపేట బిడ్డ

సిద్దిపేట జిల్లా నంగునూర్ మండలం మగ్ధుంపూర్‌కు చెందిన అచ్చిన రాకేశ్ జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో సత్తా చాటాడు. ఆల్ ఇండియా స్థాయిలో 299వ ర్యాంక్ సాధించడంతో తల్లిదండ్రుల ఆనందానికి అవధులు లేవు. దీంతో రాకేశ్‌కు గ్రామస్థులతో పాటు, బంధువులు, మిత్రులు అభినందనలు తెలుపుతున్నారు.
News April 20, 2025
ఆత్మకూరు: ప్రైవేట్ నర్సింగ్ హోమ్ సీజ్

ఆత్మకూరులో కొన్ని రోజుల క్రితం ఓ ప్రైవేట్ నర్సింగ్ హోమ్‌లో గర్భంలోనే చనిపోయిన శిశువు తల, మొండెం వేరుచేసిన ఘటన సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై విచారణ చేపట్టిన అధికారులు సర్జరీ చేసే చేసే క్రమంలో అనస్తీషియాను అర్హత లేని వ్యక్తులు ఇచ్చినట్లు విచారణలో తేలిందని జిల్లా వైద్యాధికారి శ్రీనివాసులు తెలిపారు. ఈ సందర్భంగా క్లినిక్‌ను సీజ్ చేస్తున్నట్లు వారు పేర్కొన్నారు.