News February 28, 2025
భూపాలపల్లి: ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి ఉద్యోగ విరమణ తప్పనిసరి: ఎస్పీ

ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి ఉద్యోగ విరమణ తప్పనిసరి అని జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే అన్నారు. శుక్రవారం జిల్లా పోలీసు కార్యాలయంలో AR హెడ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తించి ఉద్యోగ విరమణ పొందిన, హెడ్ కానిస్టేబుల్ గుండు నాగభూషణంను ఎస్పీ శాలువా, పులమాలతో ఘనంగా సత్కరించారు. అలాగే ఆయన సతీమణి పద్మకు గృహోపకరణాలు అందజేశారు. కుటుంబాలకు దూరంగా ఉంటూ ప్రజలకు సేవలందించడం ఎంతో గర్వకారణమని ఎస్పీ అన్నారు.
Similar News
News March 1, 2025
వేమనపల్లి ఆశ్రమ పాఠశాల హెచ్ఎం సస్పెన్షన్

మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ గిరిజన ఆశ్రమ ఉన్నత పాఠశాల హెడ్మాస్టర్ శ్రీనివాస్‌ను అధికారులు సస్పెండ్ చేశారు. పాఠశాలలో బియ్యం పక్కదారి పట్టించారనే ఆరోపణల మేరకు ఉట్నూరు ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా సస్పెండ్ చేస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. కాగా వేమనపల్లి గిరిజన ఆశ్రమ పాఠశాల హెడ్మాస్టర్ మాధవ్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు.
News March 1, 2025
పార్వతీపురం: ఒక్క నిమిషం .. వారి కోసం..!

పార్వతీపురం జిల్లా వ్యాప్తంగా 34 కేంద్రాల్లో 17,849 మంది ఇంటర్మీడియట్ విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. విద్యార్థులను ఉదయం గం.8.30 ని.ల నుంచి పరీక్షా కేంద్రంలోకి అనుమతిస్తారు. ఉదయం 9 గంటల తర్వాత ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతించమని అధికార యంత్రాంగం ప్రకటించిన విషయం తెలిసిందే. వారు పరీక్షా కేంద్రాలకు వెళ్లేటప్పుడు ట్రాఫిక్ జామ్ లేదా ప్రయాణానికి సౌకర్యం లేని వారికి కాస్త మనవంతు సాయం చేద్దాం.
News March 1, 2025
ఆదిలాబాద్ జిల్లాలో పెరిగిన ఎండ తీవ్రత

ఆదిలాబాద్ జిల్లాలో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. కొన్ని రోజుల క్రితం వరకు చలి తీవ్రత విపరీతంగా ఉండగా.. గత రెండు మూడు రోజుల నుంచి ఎండ పెరిగింది. దీంతో పొలం పనులు, ఇతర పనులకు వెళ్లే ఆదిలాబాద్ వాసులు భయపడుతున్నారు. ఆదిలాబాద్‌లో ఇవాళ, రేపు 36 °C ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ పేర్కొంది. మీ ప్రాంతంలో వాతావరణం ఎలా ఉందో కామెంట్ చేయండి.