News February 17, 2026
భూపాలపల్లి: ఫిబ్రవరి 21 నుంచి పత్తి కొనుగోళ్లు నిలిపివేత

భారత పత్తి సంస్థ మద్దతు ధర పత్తి కొనుగోళ్లు 21.02.2026 నుంచి రాష్ట్రవ్యాప్తంగా నిలిపివేయనున్నట్లు వ్యవసాయ మార్కెటింగ్ శాఖ తెలిపింది. భూపాలపల్లి జిల్లాలో ఇప్పటికీ పత్తి అమ్మని రైతులు 20.02.2026 లోగా సమీప కొనుగోలు కేంద్రంలో కాపాస్ కిసాన్ యాప్‌లో స్లాట్ బుక్ చేసుకుని విక్రయించాలని జిల్లా మార్కెటింగ్ అధికారి ప్రవీణ్ రెడ్డి సూచించారు. రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.
Similar News
News March 17, 2026
సర్కారు ‘లేజర్’ కన్ను.. మీ ఇంటి గుట్టు రట్టు..!

మూడు కార్పొరేషన్ల(GHMC, MMC, CMC) పరిధిలో ఆకాశం నుంచి లేజర్ కిరణాలతో అంగుళం, అంగుళం రికార్డు చేస్తున్నారు. ఇది అక్రమ కట్టడాల పాలిట యమపాశంగా మారనుంది. ముసీ తీరంలో గూడు కట్టుకున్న 1400 కుటుంబాలకు ఇప్పుడు కంటిమీద కునుకు లేదు. హైడ్రా చేతిలో ఈ డేటా ఉందంటే ఎప్పుడు ఏ JCB వచ్చి తలుపు తడుతుందోనన్న భయం గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. కట్టుకున్న ఇల్లు ఎప్పుడు కూలుతుందేమోనని సామాన్యుడు విలవిల్లాడుతున్నాడు.
News March 17, 2026
GNT: నాటకరంగ దిగ్గజం పెద్ది రామారావు

రచయిత పెద్ది రామారావు గుంటూరు జిల్లా ఉన్నవ గ్రామంలో 1973 మార్చి 17న జన్మించారు. ఆయన హైదరాబాద్ విశ్వవిద్యాలయంలో నాటకరంగంలో పీహెచ్‌డీ చేశారు. దూరదర్శన్‌లో ప్రసారమైన ప్రసిద్ధ ‘ఋతురాగాలు’ సీరియల్‌కు ఆయన మాటల రచయితగా పనిచేశారు. ‘యవనిక’ అనే నాటక మాసపత్రికను నడిపి నాటకరంగానికి ఎనలేని సేవ చేశారు. చిరంజీవి ‘అందరివాడు’, ఎన్టీఆర్ ‘అశోక్’ సినిమాలకు ఆయన సహ రచయితగా కూడా వ్యవహరించారు.
News March 17, 2026
కృష్ణా: 82 అంగన్వాడీ పోస్టులకు నేడే చివరి తేదీ

కృష్ణా జిల్లాలోని బందరు, బంటుమిల్లి, పామర్రు, గుడివాడ, కంకిపాడు, మొవ్వ, గన్నవరం, అవనిగడ్డ ప్రాజెక్టులలో మొత్తం 82 అంగన్వాడీ పోస్టులు భర్తీ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. 21-35 ఏళ్ల మధ్య వయస్సు కలిగి 10వ తరగతి ఉత్తీర్ణులైన వివాహిత మహిళలు అర్హులన్నారు. ఈ నెల 17లోపు దరఖాస్తులు సమర్పించాలని సూచించారు. ఇతర వివరాలకు సంబంధిత ఐసీడీఎస్ కార్యాలయాలను సంప్రదించాలని పేర్కొన్నారు.


